Samantha - Movies: అక్కినేని కోడ‌లకి ఆ ధైర్యం లేదా?

సమంత అక్కినేని (Twitter/Photo)

Samantha - Movies: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన రెండు కథలు నచ్చినా వాటిలో నటించే ధైర్యం చేయలేకపోయానని అన్నారు సమంత అక్కినేని. ఇంతకు ఆ చిత్రాలేవీ...

  • Share this:
    స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న స‌మ‌యంలోనే నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుని అక్కినేని వారింట అడుగు పెట్టిన స‌మంత అక్కినేని.. ఆ త‌ర్వాత కూడా హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. రీసెంట్‌గా స‌మంత ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ త‌న‌కు ఓ ద‌ర్శ‌కుడు రెండు క‌థ‌లు చెప్పాడ‌ని, క‌థ‌లు చాలా బాగున్నాయ‌ని, అయితే వాటిని చేసే ధైర్యం త‌న‌కు లేకుండా పోయింద‌ని వాపోయింది. ఇంత‌కీ స‌మంత వెనుక‌డుగేసేటంత గొప్ప క‌థ‌లు చెప్పిన ద‌ర్శ‌కుడు ఎవ‌రా? అనే సందేహం రాక మాన‌దు. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈ యంగ్ డైరెక్ట‌ర్ జాంబీ రెడ్డి చేయ‌డానికి ముందు స‌మంతను క‌లిసి రెండు క‌థ‌లు చెప్పాడ‌ట‌. కానీ ఎందుక‌నో అప్పుడు స‌మంత పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ట‌. కానీ అస‌లు కార‌ణంగా త‌న‌కు ధైర్యం స‌రిపోలేద‌ని ఇప్పుడు చెప్పింది. అయితే ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న‌కు చెప్పిన క‌థ‌ల‌తో

    అక్కినేని ఇంట అడుగుపెట్టిన త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌మిస్తూ వ‌స్తున్న స‌మంత యు టర్న్‌, ఓ బేబీ చిత్రాల‌తో ప్రేక్ష‌కులను అల‌రించింది. ఈ రెండు చిత్రాలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే. యు ట‌ర్న్ ప‌రావాలేద‌నిపిస్తే.. ఓ బేబీ మాత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమా త‌ర్వాత స‌మంత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌లేదు. స‌మంత త‌ర్వాత సినిమా ఏద‌నే దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేదు కానీ. ప‌లు ద‌ర్శ‌కులు, నిర్మాణ సంస్థ‌ల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. కోవిడ్ ప్రారంభం కాగానే ఇంటికే ప‌రిమిత‌మైన స‌మంత ఈ మ‌ధ్య‌నే భ‌ర్త‌తో క‌లిసి మాల్దీవుల్లో హ‌ల్‌చ‌ల్ చేసింది. అంతే కాదండోయ్.. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పుడు బిగ్‌బాస్ 4 షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అలాగే ఇప్పుడు ఓటీటీ మాధ్యమం ఆహాలో సామ్ జామ్ అనే టాక్ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. ఈ షోను నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తుంది.

    మరి సమంత సినిమాలెప్పుడు చేస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే స‌మంత.. ఓ హార‌ర్ మూవీలో న‌టించ‌బోతుంద‌ని అంటున్నారు. ఆ సినిమాను నందినీ రెడ్డి డైరెక్ట్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని, సోని పిక్చ‌ర్స్‌తో పాటు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణ భాగ‌స్వామ్యంలో ఈ సినిమా తెర‌కెక్కే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. అంత‌కు ముందు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత ఓ త్రిభాషా చిత్రంలో న‌టించ‌నుంద‌ని కూడా వార్త‌లు వినిపించాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.
    Published by:Anil
    First published: