‘అల వైకుంఠపురం’లో అదిరిపోయే పాట... సామజవరగమన అంటూ...

‘సామజవరగమన’ అంటూ సాగే పాటను సోషల్‌మీడియా వేదికగా సినిమా యూనిట్ శనివారం విడుదల చేసింది

news18-telugu
Updated: September 28, 2019, 10:33 AM IST
‘అల వైకుంఠపురం’లో అదిరిపోయే పాట... సామజవరగమన అంటూ...
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్
  • Share this:
బన్నీ తన ఫ్యాన్స్ అదరిపోయే పాటతో సర్ ప్రైజ్ చేశాడు. ‘అల వైకుంఠపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కోసం ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశాడు. ఈ సినిమా నుంచి ‘సామజవరగమన’ అంటూ సాగే పాటను సోషల్‌మీడియా వేదికగా సినిమా యూనిట్ శనివారం విడుదల చేసింది. పాట లిరిక్స్, మ్యూజిక్ అదిరిపోయింది. పాట విన్నవాళ్లంతా సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తమన్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. సిధ్ శ్రీరామ్ ఈ పాటను పాడారు.

‘అల వైకుంఠపురములో..’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరక్షన్ ‘జులాయి’ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’. పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రీలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Published by: Sulthana Begum Shaik
First published: September 28, 2019, 10:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading