అన్ని రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన అల్లు అర్జున్...

అల్లు అర్జున్ తాజా సినిమా 'అల వైకుంఠపురములో'.. రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. 

news18-telugu
Updated: October 19, 2019, 12:50 PM IST
అన్ని రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన అల్లు అర్జున్...
Instagram/alluarjunonline
  • Share this:
అల్లు అర్జున్ తాజా సినిమా 'అల వైకుంఠపురములో'.. రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టిస్తోంది.  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దమవుతోంది. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆ మధ్య విడుదలైన ఓ పాట సంచలనాలకు చిరునామాగా మారింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని సామజవరగమన పాట విడుదలైనప్పటి నుండి యూ ట్యూబ్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఈ పాట విడుదలైన మొదటి రెండు రోజులు యూ ట్యూబ్‌లో నెం 1గా ట్రెండింగ్ అవుతూ అదరగొట్టింది. కాగా ఈ పాట మరో రికార్డ్‌ను సృష్టించింది. సామజవరగమన యూట్యూబ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన పాటగా రికార్డ్ సృష్టించింది. ఇదే విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఏ తెలుగు సాంగ్‌కు ఇంత సంఖ్యలో లైక్స్ రాలేదని.. ఇంతకు ముందున్న రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతూ.. రికార్డ్ సృష్టించింది. కాగా  ఈ సాంగ్‌‌కు ఇప్పటికే 41 మిలియన్ వ్యూస్ రాగా.. 700K లైక్స్‌తో ఏ తెలుగు సాంగ్‌కు రాని లైక్స్ ‌తో రికార్డ్ సృష్టించింది.
 View this post on Instagram
 

THE MOST LIKED TELUGU SONG . Thank you all for all the love . #samajavaragamana #alavaikunthapuramulo


A post shared by Allu Arjun (@alluarjunonline) on

తమన్ సంగీతం అందించిన ఈ  సామజవరగమన పాట క్యాచీ ట్యూన్‌తో ఉండటంతో ప్రేక్షకులు కూడా కట్టిపడేస్తోంది. దీనికి తోడు సిరివెన్నెల సాహిత్యం.. సిద్ శ్రీరామ్ వాయిస్ పాటను మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తోన్న ఈ సినిమా  జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. 
View this post on Instagram
 

AlaVaikunthapurramuloo releasing this Sankranthi on Jan 12th 2020 ! #AlaVaikunthapurramuloo


A post shared by Allu Arjun (@alluarjunonline) on
First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading