Salman Khan - Kisi Ka Bhai Ka Jaan: సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. వేరే హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. గతేడాది చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సల్లూ భాయ్.. తాజాగా ఈ రోజు విడుదలైన షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో సల్లూ భాయ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. తాజాగా ఈయన హీరోగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు విడుదల చేసారు. ఈ సినిమా టీజర్ సల్మాన్ ఖాన్ మార్క్ యాక్షన్‌తో అదిరిపోయింది. ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేసారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ మరో ముఖ్యపాత్రలో యాక్ట్ చేస్తున్నారు. పూజా హెగ్డే అన్న పాత్రలో నటిస్తున్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ తరహాలో తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో ఈ సినిమాను ఉండనుంది.
SALMAN KHAN: 'KISI KA BHAI KISI KI JAAN' TEASER IS HERE... #SalmanKhan arrives this #Eid with his latest offering: #KisiKaBhaiKisiKiJaan… Directed by #FarhadSamji. #KBKJ
Here’s #KBKJTeaser: https://t.co/AP3QbNVuEH pic.twitter.com/VFEW1FBis4 — taran adarsh (@taran_adarsh) January 25, 2023
ముందుగా ఈ సినిమాకు కభీ ఈద్ కభీ దివాళి అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’గా పేరు మార్చారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో 2023 ఈద్ పండగ రోజున విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్.. టైగర్ 3 సినిమా చేస్తున్నాడు. మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఇందులో ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్నాడు. టైగర్ సిరీస్‌లో వస్తోన్న మూడో సీక్వెల్. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ యేడాది 2023 దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
భజరంగీ భాయిజాన్ 2: ట్రిపుల్ హిందీ ఈవెంట్‌లో భాగంగా ఈ సినిమా సీక్వెల్ ప్రకటించాడు సల్మాన్ ఖాన్. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. నో ఎంట్రీ 2: సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించబోయే నో ఎంట్రీ 2 లేదా నో ఎంట్రీ మే ఎంట్రీ’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.కిక్ 2: ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా సల్మాన్ ఎప్పుడో అనౌన్స్ చేసాడు. దీని గురించి త్వరలోనే అధికారిక సమాచారం బయటికి రానుంది. దీనిపై కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Kisi Ka Bhai Kisi Ki Jaan, Salman khan, Venkatesh