చిక్కుల్లో సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీ.. ఇంతకీ ఏమైందో తెలుసా..

గత కొన్నేళ్లుగా ఏ చిత్రం తీసుకున్న ఏదో ఒక సమస్య సినిమాను తీసినవాళ్లను చుట్టు ముడుతూనే ఉంది.తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ మూవీ కూడా ఇదే రకమైన సమస్యలను ఎదుర్కొంటుంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 31, 2019, 8:12 PM IST
చిక్కుల్లో సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీ.. ఇంతకీ ఏమైందో తెలుసా..
‘భారత్’లో సల్మాన్ ఖాన్
  • Share this:
గత కొన్నేళ్లుగా ఏ చిత్రం తీసుకున్న ఏదో ఒక సమస్య సినిమాను తీసినవాళ్లను చుట్టు ముడుతూనే ఉంది.తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ మూవీ కూడా ఇదే రకమైన సమస్యలను ఎదుర్కొంటుంది. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్‌తో ‘సుల్లాన్’,‘టైగర్ జిందా హై’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్ జఫర్..తాజాగా ‘భారత్’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌కు టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ సినిమాను రంజాన్ పండగ కానుకగా జూన్ 5న విడుదల చేయనున్నారు. తాాజాగా ఈ చిత్రానికి ‘భారత్’ పేరు సరికాదంటూ విపిన్ త్యాగీ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. ఈ సినిమా పేరు చిహ్నాలు, పేర్ల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని తన పిటిషన్‌లో తెలిపాడు. అదే విధంగా ఈ సినిమాలో సల్మాన్ తన పేరును దేశంతో పోల్చడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఈ పేరు మా లాంటి దేశభక్తుల మనోభావాలను కించపరిచేలా ఉందన్నారు. అంతేకాదు ఈ సినిమాలో భారత్ పేరును దేశంతో పోల్చడం ఉన్న డైలాగులను కూడా తొలిగించమని డిమాండ్ చేశారు. ఈ కేసుపై ‘భారత్’ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Salman khan's Bharath Movie faces Deep Trouble..,salman khan,delhi high court,bharat delhi high court,bharath movie twitter,salman khan twitter,salman khan instagram,bharat in delhi high court,salman khan court notice,salman khan bharat,bharat salman khan,salman bharat dialogue,salman bharat trouble,salman khan in trouble,salman khan case,salman khan movies,salman khan court verdict,salamn katrina bharat,bombay high court,pil against salman khan,high court,salman khan bharat shooting,bharath movie review,bharath movie release date,సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ భారత్,చిక్కుల్లో భారత్ మూవీ,భారత్ టైటిల్ పై వివాదం,మరో వివాదంలో సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ దిశా పటానీ,బాలీవుడ్,హిందీ సినిమా,
‘భారత్’లో సల్మాన్ ఖాన్


సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈసినిమాలో కత్రినా కైఫ్,దిశా పటానీ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీని కొరియాలో హిట్టైన ‘ఓడ్ టూ మై ఫాదర్’ ను మన నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ 18 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్దుడి వరకు వివిధ గెటప్‌లలో కనిపించనున్నాడు.
First published: May 31, 2019, 8:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading