Home /News /movies /

SALMAN KHAN YOUNG CISF OFFICER STOPS SALMAN KHAN AT MUMBAI AIRPORT AND CHECK ALL FORMALITIES AS LIKE COMMON MAN TA

Salman Khan : సల్మాన్ అయితే నాకేంటి.. ? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సల్లూ భాయ్‌కు చుక్కలు చూపించిన యువ అధికారి..

ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో సల్మాన్‌కు చుక్కెదురు (Instagram/Photo)

ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో సల్మాన్‌కు చుక్కెదురు (Instagram/Photo)

Salman Khan : సల్మాన్ అయితే నాకేంటి.. ? ఎవరైనా నాకేంటి అంటూ ఓ యువ CISF అధికారి సల్మాన్‌ ఖాన్‌ను ఎయిర్‌పోర్ట్‌ చెకింగ్ సెండర్‌లో ఆపి చెక్ చేసి పంపించిన ఘటన రీసెంట్‌గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది.

    Salman Khan : సల్మాన్ అయితే నాకేంటి.. ? ఎవరైనా నాకేంటి అంటూ ఓ యువ CISF అధికారి సల్మాన్‌ ఖాన్‌ను ఎయిర్‌పోర్ట్‌ చెకింగ్ సెండర్‌లో ఆపి చెక్ చేసి పంపించిన ఘటన రీసెంట్‌గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. మన దేశంలో సినిమావాళ్లంటూ సామాన్యులకు ఎంతో క్రేజ్. అందుకే మన దగ్గర చాలా మంది హీరోలు రాజకీయాల్లో పోలో మంటూ వచ్చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో సినిమా నటులను ఆరాధించడం అనేది పీక్స్ అనే చెప్పాలి.  ఇలాంటి పిచ్చి క్రేజ్ వల్లనే మన దగ్గర ఎమ్జీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వాళ్లు సీఎం కుర్చులో కూర్చగలిగారు. అంతలా తమ సినిమాలతో మాస్‌లో క్రేజ్ సంపాదించుకున్న వాళ్లు మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో  చాలా మందే ఉన్నారు. అంతేకాదు మన దగ్గర ఎవరైనా సెలబ్రిటీ కనపడితే.. డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు కూడా వాళ్ల బాధ్యతలు మరిచి వాళ్లతో  సెల్ఫీల కోసం ఎగబడ్డ  సందర్భాలున్నాయి. అంతలా సినీ నటులు కనిపిస్తే.. తాము పనిచేసే డ్యూటీ కూడా మర్చిపోయే అధికారులున్న ఈ రోజుల్లో ఓ యువ సీఐఎస్ఎఫ్ అధికారి.. బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్‌కు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బిగ్ షాక్ ఇచ్చారు.

    ముంబై విమానాశ్రమంలో సెక్యురిటీ చెకింగ్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోతున్న సల్మాన్‌ ఖాన్‌ను అక్కడ విధుల్లో ఉన్న ఓ యువ అధికారి ఆపి .. ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్లాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


    సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘టైగర్ 3’ షూటింగ్ కోసం రష్యా వెళ్లేందకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఎవరైనా సెక్యురిటీ చెక్ చేయించుకోని వెళ్లాలి. ఒక అగ్ర హీరో అనే అహంభావంతో సల్మాన్ ఖాన్ ఇవేమి పట్టించుకోకుండా వెళ్లిపోతుండంతో అక్కడే విధుల్లో ఉన్న యువ CISF అధికారి మాత్రం సామాన్య పౌరులు ఏ విధంగా అన్ని  ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారో.. అదే విధంగా మీరు లైన్‌లో నిలబడి మాకు సెక్యురిటీ చెక్ చేయించుకొని వెళ్లాల్సిందే అంటూ సల్మాన్‌ను కోరారు. ఈ విధంగా ఆ యువ అధికారి విధుల్లో చూపిన శ్రద్ధ చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక యువ అధికారి సల్మాన్‌ను చెక్ చేయించుకోవాల్సిందిగా చెప్పిన వీడియను కొంత మంది వీడియో రూపంలో బంధించారు. ఇపుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    ఇవి కూడా చదవండి.. 

    Evaru Meelo Koteeswarulu - Jr NTR : ఎన్టీఆర్ షోలో రానా సాయం తీసుకున్న రామ్ చరణ్..


    Nagarjuna - Ram Charan: ఆ తరంలో నాగార్జున.. ఈ జననరేషన్‌లో రామ్ చరణ్‌కు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది..


    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

    Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..


    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Salman khan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు