• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SALMAN KHAN WAS THE MAIN SPOILER OF MY DAUGHTER JIAH KHAN SUICIDE CASE SAYS HER MOTHER PK

సల్మాన్ కారణంగానే జియా ఖాన్‌కు అన్యాయం.. నటి తల్లి సంచలనం..

సల్మాన్ కారణంగానే జియా ఖాన్‌కు అన్యాయం.. నటి తల్లి సంచలనం..

సల్మాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జియా ఖాన్ తల్లి రబియా (salman khan jiah khan)

Salman Khan: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో బాలీవుడ్‌లో జరుగుతున్న అక్రమాల గురించి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయంటున్నారు నెటిజన్లు. బహుశా ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని చెప్పడానికే..

  • Share this:
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో బాలీవుడ్‌లో జరుగుతున్న అక్రమాల గురించి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయంటున్నారు నెటిజన్లు. బహుశా ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని చెప్పడానికే నిన్ను నువ్వు బలి చేసుకున్నావా సుశాంత్ అంటూ అభిమానులు ఆయన కోసం కన్నీరు కారుస్తున్నారు. ఎంతో టాలెంట్.. మరెంతో భవిష్యత్తు ఉన్న నటుడిని అన్యాయంగా చంపేసారు కదరా అంటూ కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ అండ్ గ్యాంగ్‌తో సోషల్ మీడియాలో ఓ రేంజిలో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా సుశాంత్ ఫ్యాన్స్ అంటే మండిపోతున్నారు. వాళ్లు కనిపిస్తే చంపేసేలా కనిపిస్తున్నారు అభిమానులు.

సల్మాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జియా ఖాన్ తల్లి రబియా (salman khan jiah khan)
సల్మాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జియా ఖాన్ తల్లి రబియా (salman khan jiah khan)


ఇదిలా ఉంటే ఇప్పుడు సుశాంత్ మరణం తర్వాత ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన నటి జియా ఖాన్ గురించి ఆమె తల్లి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ మరణంతో మరోసారి బాలీవుడ్‌లో ఎలాంటి రాబంధులు ఉన్నారో అర్థమైపోతుంది.. ఇప్పటికైనా తెలుసుకుని నిరసన తెలపండి అంటూ రబియా చెప్పుకొచ్చింది. తను కూడా బాలీవుడ్‌ ప్రముఖుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. కూతురు చనిపోయినా కూడా ఆమె ఆత్మకు శాంతి లేకుండా అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జియా ఖాన్ తల్లి రుబియా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌‌పై సంచలన ఆరోపణలు చేసింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియా ఖాన్ (Sushant Singh Rajput Jiah Khan)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియా ఖాన్ (Sushant Singh Rajput Jiah Khan)


తన కుమార్తె ఆత్మహత్య దర్యాప్తును సల్మాన్‌ దెబ్బ తీశాడని.. సూరజ్‌ పంచోలిని కాపాడటం కోసం సల్మాన్‌ తన పేరు, డబ్బును ఉపయోగించాడని తెలిపింది రబియా. సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంతాపం తెలిపిన రబియా.. ఆయన మరణం తన గుండెను ముక్కలు చేసిందని చెప్పుకొచ్చింది. బెదిరించడం కూడా ఓ రకంగా చంపడం లాంటిదే అని తెలుసుకోండి అంటూ పేర్కొంది ఈమె. ఈ క్రమంలోనే తన కూతురు జియా ఖాన్ కేసు విషయంలో 2015 సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంది రబియా.

సల్మాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జియా ఖాన్ తల్లి రబియా (salman khan jiah khan)
సల్మాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జియా ఖాన్ తల్లి రబియా (salman khan jiah khan)


అప్పట్లో సీబీఐ అధికారులు తనకు ఫోన్‌ చేసి మీరు ఒకసారి ఆఫీసుకు రండి.. మీ అమ్మాయి ఆత్మహత్య కేసు విషయంలో ఒక ముఖ్యమైన ఆధారం దొరికిందని చెప్పి తనను లండన్ నుంచి పిలిపించారని.. తీరా అక్కడికి తాను అక్కడికి వచ్చిన తర్వాత సల్మాన్‌ ఖాన్‌ ప్రతిరోజు తనకు కాల్‌ చేసి.. సూరజ్‌ పంచోలి మీద చాలా పెట్టుబడి పెట్టాను.. అతడిని వేధించకండి. దయచేసి అతడిని విచారించకండి.. అసలు ఆ కుర్రాడి జోలికే వెళ్లకండి అని చెప్తున్నాడని సదరు ఆఫీసర్ చెప్పినట్లు తెలిపింది రబియా. ఇలాంటి సమయంలో తానేం చేయాలి మేడమ్ అని ఆఫీసర్ తనను అడిగినట్లు చెప్పుకొచ్చింది ఈమె.

సల్మాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జియా ఖాన్ తల్లి రబియా (salman khan jiah khan)
సల్మాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జియా ఖాన్ తల్లి రబియా (salman khan jiah khan)



న్యాయం కూడా జరక్కుండా బాలీవుడ్‌లో ఇలా డబ్బు, పరపతి వాడుతున్నారంటే కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుస్తుందా అంటూ ప్రశ్నించింది ఈమె. బాలీవుడ్‌లో ఉన్న ఈ ప్రాణాలు తీస్తున్న ప్రవర్తనపై నోరు విప్పండి.. పోరాడండి అంటూ పిలుపునిచ్చింది రబియా. 2013 జూన్ 3న ముంబైలోని జుహులోని తన నివాసంలోనే జియా ఖాన్‌ ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో ఈమె మరణానికి కారణం సూరజ్ పంచోలీ అనే ఆరోపణలు చాలానే వచ్చాయి. తన మరణానికి కారణం కూడా సూరజ్ పంచోలీతో బ్రేకప్ అంటూ సూసైడ్ నోట్ కూడా రాసింది జియా. అందుకే ఆ తర్వాత కేసు పెట్టారు కుటుంబ సభ్యులు. కానీ ఆ కేసు చివరికి నిర్వీర్యం చేసారని బాధ పడుతుంది రబియా.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు