సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో సందడి చేశారు. బాలీవుడ్ భాయ్ వస్తున్నాడన్న సమాచారంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కూకట్ పల్లి సుజనా ఫోరం మాల్ లో ‘అంతిమ్’ సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన సల్మాన్.. హైదరాబాద్ గురించి, ఇక్కడి ప్రఖ్యాత బిర్యానీ గురించీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హైదరాబాద్ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని, సిటీకి ఎప్పుడొచ్చినా బిర్యానీ తింటానని, ఇవాళ కూడా విమానం దిగగానే హైదరాబాద్ బిర్యానీ రుచి చూశానని సల్లూ భాయ్ చెప్పాడు.
సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్ పై తానే హీరోగా నటించిన ‘అంతిమ్’ సినిమా ప్రమోషన్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. అజయ్ శర్మ విలన్ గా, మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 26న విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాతలు హైదరాబాద్ లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. అంతిమ్ సినిమా అందరినీ మెప్పిస్తోందన్న సల్మాన్ ఖాన్.. మరోసారి సిటీకి వచ్చినప్పుడు అభిమానుల్ని నేరుగా కలుసుకుంటానని మాటిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad biryani, Salman khan