హోమ్ /వార్తలు /సినిమా /

Salman Khan: బాలీవుడ్ చిత్రంలో తెలంగాణ బతుకమ్మ పాట.. వెంకటేష్,పూజా హెగ్డేలతో సల్మాన్ సందడి..

Salman Khan: బాలీవుడ్ చిత్రంలో తెలంగాణ బతుకమ్మ పాట.. వెంకటేష్,పూజా హెగ్డేలతో సల్మాన్ సందడి..

సల్మాన్ ఖాన్ చిత్రంలో ‘బతుకమ్మ’ పాట (Twitter/Photo)

సల్మాన్ ఖాన్ చిత్రంలో ‘బతుకమ్మ’ పాట (Twitter/Photo)

Salman Khan - Bathukamma Song : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు సినిమాల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా సల్మాన్ ఖాన్ నటిస్తోన్న చిత్రంలో ‘బతుకమ్మ’ పాట పెట్టడం విశేషం. తాజాగా ఈ పాటను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Salman Khan - Bathukamma Song : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు సినిమాల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఏర్పడింది.  గత కొన్నేళ్లుగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ‘బలగం’, తాజాగా దసరా వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టాయి. తెలుగు సినిమాల్లోనే తెలంగాణకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచి పరిణామనే చెప్పాలి. కానీ బాలీవుడ్ సినిమాల్లో కూడా ఇపుడు తెలంగాణ సంస్కృతికి ప్రాధాన్యత  ఇస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో వెంకటేష్ మరో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాలో వెంకీ చెల్లెలు పాత్రలో పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాలో వీళ్లు తెలుగు వాళ్లు కాదు.. కాదు తెలంగాణకు చెందిన వాళ్ల పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బతుకమ్మ తెలుగు పాటను పెట్టారు. ఒక హిందీ సినిమాలో నేరుగా తెలుగు పాట పెట్టడం అనేది ఇదే మొదటి సారి అనుకోవచ్చు.

గతంలో రాజ్‌కపూర్, నర్గీస్‌ల ‘శ్రీ 420’లో రామయ్య వస్తావయ్య అంటూ తెలుగు పదాన్ని ఉపయోగించారు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో డైరెక్ట్‌గా తెలుగు అది కూడా తెలంగాణ సెంటిమెంట్‌కు నిలయమైన బతుకమ్మ సాంగ్‌ను పెట్టడం చూసి తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఫీలవుతున్నారు.

సల్మాన్ ఖాన్ విషయానికొస్తే..  ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. వేరే హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. గతేడాది  చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సల్లూ భాయ్.. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో సల్లూ భాయ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేసారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ మరో ముఖ్యపాత్రలో యాక్ట్ చేస్తున్నారు. పూజా హెగ్డే అన్న పాత్రలో నటిస్తున్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ తరహాలో తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో ఈ సినిమాను ఉండనుంది.

ముందుగా ఈ సినిమాకు కభీ ఈద్ కభీ దివాళి అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’గా  పేరు మార్చారు.  ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో 2023 ఈద్ పండగ రోజున విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్..  టైగర్ 3 సినిమా చేస్తున్నాడు.  మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఇందులో ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్నాడు. టైగర్ సిరీస్‌లో వస్తోన్న మూడో సీక్వెల్. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ యేడాది 2023 దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Tollywood Tier 2 Heroes First Day Openings: దసరా సహా తెలుగులో మీడియం రేంజ్ హీరోల్లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు..

భజరంగీ భాయిజాన్ 2: ట్రిపుల్ హిందీ ఈవెంట్‌లో భాగంగా ఈ సినిమా సీక్వెల్ ప్రకటించాడు సల్మాన్ ఖాన్. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. నో ఎంట్రీ 2: సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించబోయే నో ఎంట్రీ 2  లేదా నో ఎంట్రీ మే ఎంట్రీ’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.కిక్ 2: ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా సల్మాన్ ఎప్పుడో అనౌన్స్ చేసాడు. దీని గురించి త్వరలోనే అధికారిక సమాచారం బయటికి రానుంది. దీనిపై కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

First published:

Tags: Bathukamma, Bollywood, Kisi Ka Bhai Kisi Ki Jaan, Pooja Hegde, Saindhav Movie, Salman khan, Tollywood, Venkatesh

ఉత్తమ కథలు