• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SALMAN KHAN TROLLED FOR SMOKING AT GANESH UTSAV FANS SAY BROTHER BE ASHAMED TA

Salman Khan: ఛీ..ఛీ.. గణపతి ఉత్సవాల్లో ఇదేం పని సల్మాన్ ఖాన్..

Salman Khan: ఛీ..ఛీ.. గణపతి ఉత్సవాల్లో ఇదేం పని సల్మాన్ ఖాన్..

సల్మాన్ ఖాన్ (File Photo)

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు అపుడపుడు తప్పుడు పనులతో వార్తల్లోకి ఎక్కుతారు. ఇప్పటికే తప్పతాగి పలువురు మరణానికి కారణమైన ఆరోపణలు, కృష్ణ జింకలను వేటాడిన కేసులతో సతమతమవతున్న సల్మాన్ ఖాన్.. తాజాగా గణేష్ నిమజ్జనోత్సవం సందర్బంగా చేసిన పని ఇపుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Share this:
    అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు అపుడపుడు తప్పుడు పనులతో వార్తల్లోకి ఎక్కుతారు. ఇప్పటికే తప్పతాగి పలువురు మరణానికి కారణమైన ఆరోపణలు, కృష్ణ జింకలను వేటాడిన కేసులతో సతమతమవతున్న సల్మాన్ ఖాన్.. తాజాగా గణేష్ నిమజ్జనోత్సవం సందర్బంగా చేసిన పని ఇపుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సల్మాన్ ఖాన్..తన చెల్లెలు అర్పితా ఇంట్లో జరిగిన వినాయక ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఒకవైపు గణపతి ఉత్సవం జరుగుతుండగా.. సల్మాన్ ఖాన్..ఒక చోట నిలబడి సిగరెట్ తాగడం ఇపుడు వివాదంగా మారింది. ఐతే అంతకు ముందు సల్మాన్ ఖాన్..ఎంతో నిష్ఠగా గణపతి పూజా చేసిన తర్వాత దూరంగా ఒక చోట నిలబడి సిగరెట్ కాల్చారని సల్మాన్  సన్నిహితులు చెబుతున్నారు.



    ఏమైనా పవిత్రమైన గణపతి పూజ జరుగుతున్న చోట సల్మాన్ ఇలా ప్రవర్తించడాన్ని మాత్రం అభిమానులతో పాటు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు