సల్మాన్ ఖాన్ పై నెటిజన్స్ ట్రోలింగ్.. చేసిన ఓవరాక్షన్ చాలు అంటూ కామెంట్స్..

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కరోనా నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో చేసిన పోస్ట్‌తో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.

news18-telugu
Updated: July 15, 2020, 10:57 PM IST
సల్మాన్ ఖాన్ పై నెటిజన్స్ ట్రోలింగ్.. చేసిన ఓవరాక్షన్ చాలు అంటూ కామెంట్స్..
బురదతో సల్మాన్ ఖాన్ (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కరోనా నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. అంతేకాదు ఈ గ్యాప్‌లోనే తన గర్ల్ ఫ్రెండ్ జాక్వెలిన్‌తో కలిసి కొన్ని పాటలను షూట్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసాడు కూడా వీటికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మధ్య మధ్యలో తాను జిమ్‌లో వ్యాయామం కోసం కష్టపడుతున్న ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు. ఐతే.. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ పై నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. సుశాంత్ మరణానికి ఓ రకంగా సల్మాన్ ఖాన్ కారణమే అంటూ ఆయనకు సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు అన్‌ఫాలో చేసారు. తాజాగా ఈయన తన ఫామ్‌ హౌస్‌లో రైతు అవతారంలో ఒళ్లంత బురదతో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసాడు.


ఈ ఫోటోలో సల్మాన్ ఖాన్ బురదతో ఉండటంతో పాటు రైతులకు గౌరవం ఇవ్వడంటూ పేర్కొన్నాడు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సల్మాన్ ఖాన్ పై ఫైర్ అవుతున్నారు. భాయ్ నువ్వు చేసిన ఓవరాక్షన్ చాలు.. నిజమైన రైతులు ఎవరు మొఖానికి బురదతో ఉన్నట్టు ఎక్కకడా చూడలేదంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

చేతులకు బురద పూసుకున్నావు. కాళ్లకు పూసుకోవడం మర్చిపోయావా అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. మొత్తంగా సల్మాన్ ఖాన్.. ఎరక్కపోయి పెట్టిన పోస్ట్‌తో అడ్డంగా బుక్ అయిపోయాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 15, 2020, 10:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading