• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SALMAN KHAN TO REMAKE RAVI TEJA UP COMIG MOVIE KHILADI HERE ARE THE DETAILS TA

Salman Khan: మరోసారి టాలీవుడ్ సినిమాపై సల్మాన్ ఖాన్ కన్ను.. ఇంతకీ ఏ సినిమానో తెలుసా..

Salman Khan: మరోసారి టాలీవుడ్ సినిమాపై సల్మాన్ ఖాన్ కన్ను.. ఇంతకీ ఏ సినిమానో తెలుసా..

సల్మాన్ ఖాన్ (Salman khan photo : Twitter)

Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హిట్స్ సినిమాల్లో ఎక్కువ భాగం రీమేక్ సినిమాలే కావడం విశేషం. తాజాగా స సల్మాన్ ఖాన్ మరో తెలుగు సినిమాపై నజర్ పెట్టినట్టు సమాచారం.

  • Share this:
    Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హిట్స్ సినిమాల్లో ఎక్కువ భాగం రీమేక్ సినిమాలే కావడం విశేషం. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు సల్మాన్ ఖాన్. తాజాగా సల్మాన్ ఖాన్ మరో తెలుగు సినిమాపై కన్నేసారు. ఐతే.. ఈ సారి మాత్రం సల్మాన్ ఖాన్.. తెలుగులో సూపర్ హిట్టైన సినిమాను కాకుండా .. సెట్స్ పై ఉన్న సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సల్మాన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా అంటే.. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఖిలాడి’ సినిమా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసి సల్మాన్ ఖాన్ ఇంప్రెస్ అయ్యాడట. అంతేకాదు తనకు సంబంధించిన వాళ్లతో ఈ సినిమా డీటెల్స్ కనుక్కోమని చెప్పాడట. ఈ సినిమాను బాలీవుడ్‌కు చెందిన పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది.

    అంతేకాదు ‘ఖిలాడి’ హిందీ రీమేక్ బాధ్యతలను కూడా రమేష్ వర్మకే ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడట. ఇక పెన్ స్టూడియోస్‌లో సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. పనిలో పనిగా ఈ సినిమాను పెన్ స్టూడియోస్‌తో కలిసి సల్మాన్ ఖాన్ తన ఓన్ బ్యానర్‌లో తెరకెక్కించనున్నట్టు సమాచారం.

    Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హిట్స్ సినిమాల్లో ఎక్కువ భాగం రీమేక్ సినిమాలే కావడం విశేషం.
    రవితేజ ఖిలాడి రీమేక్‌లో రవితేజ (Twitter/Photo)


    ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే.. ‘కిక్’ తర్వాత సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తోన్న రవితేజ రెండో మూవీ ఇదే అవుతోంది. ఇక హిందీలో ఈ సినిమాకు ‘ఖిలాడి’ టైటిల్ కాకుండా.. ‘ఉస్తాద్ భాయ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: