సల్మాన్ ఖాన్ భారీ సాయం.. 25 వేల మంది కళాకారులకు..

Salman Khan: బాలీవుడ్ హీరోలు కూడా ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ 25 కోట్లు విరాళం ఇచ్చి సంచలనం రేపాడు. సల్మాన్ ఖాన్ కూడా తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 29, 2020, 5:49 PM IST
సల్మాన్ ఖాన్ భారీ సాయం.. 25 వేల మంది కళాకారులకు..
సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో (salman khan)
  • Share this:
కరోనా బాధితుల కోసం ఇప్పటి వరకు తెలుగు హీరోలు విరాళం అందించారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు కూడా ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే అక్కడ అక్షయ్ కుమార్ ఏకంగా 25 కోట్లు విరాళం ఇచ్చి సంచలనం రేపాడు. సల్మాన్ ఖాన్ కూడా తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. కోట్లకు కోట్లు సంపాదించే హీరోలు.. ఇప్పుడు జనానికి అవసరం అయిన సమయంలో కూడా ముందుకు రావడం నిజంగానే అభినందనీయం. ఇప్పటికే చాలా మంది హీరోలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోచిన సాయం చేసారు.. ఇంకా చేస్తున్నారు కూడా.
దబంగ్ 3 లో సల్మాన్ ఖాన్ (Twitter/Photo)
దబంగ్ 3 లో సల్మాన్ ఖాన్ (Twitter/Photo)


ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్ కూడా సినిమా కార్మికులకు ఆపన్న హస్తం అందిస్తున్నాడు. నేనున్నానంటూ ముందుకొస్తున్నాడు కండల వీరుడు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సినిమా కళాకారులకు పూట గడవడం కూడా కష్టంగా మారుతుంది. రోజువారి కూలీతో కడుపు నింపుకునే వాళ్లకు ఇప్పుడు గంజి కూడా దొరకడం గగనమైపోయింది. దాంతో వాళ్లు ఆకలితో అలమటించకూడదని సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇంకా చేయాలని FWVIC (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్) నిర్ణయించింది.
సల్మాన్ ఖాన్ (file photo)
సల్మాన్ ఖాన్ (file photo)

ఈ మేరకు ఆ సంస్థ అధికార ప్రతినిధి బీఎన్ తివారీ మాట్లాడుతూ సాయం చేయడానికి సల్మాన్ ఖాన్ ముందుకొచ్చాడని చెప్పాడు. ఆయన బీయింగ్ హ్యూమన్‌ ఫౌండేషన్ ద్వారా సల్మాన్ దినసరి వారీగా పనిచేసే కళాకారులకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే 25 వేల మంది కళాకారులకు నేరుగా అకౌంట్లలో డబ్బులు వేయనున్నట్లు ప్రకటించాడు తివారీ. సల్మాన్ ఖాన్ చేస్తున్న ఈ సాయానికి అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading