ఇద్దరు సూపర్ స్టార్లు కలిస్తే అభిమానులకు పండగే.ఇక వారిద్దరూ కలిసి స్టెప్పులేస్తే ఫ్యాన్స్ కూడా పూనకాలు వచ్చి ఊగిపోతారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మరోకొత్త చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ముంబైలో చిరంజీవి సల్మాన్ ఖాన్ పాల్గొన్న సీన్స్‌ను షూట్ చేశారు. సల్మాణ్ ఖాన్, చిరుపై ఓ పాట కూడా తీశారు. అయితే డాన్స్‌లో చిరుకు ఎదురు లేదు. ఆయన ఎప్పుడూ నెంబర్ వన్. ఇక సల్మాన్ కూడా తనదైన స్టైల్లో స్టెప్పులేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
అలాంటి ఈ స్టార్ హీరోలంతా కలిసి తెరపై చిందేస్తే థియేటర్లు దద్దరిలిల్లి పోవాల్సిందే. గాడ్ ఫాదర్ దర్శక నిర్మాతలు మోహన్ రాజా, ఎన్వీ ప్రసాద్,ఎన్వీ ప్రసాద్, నిానికి ఈ చిత్రం మలయాళ వెర్షన్ లూసిఫర్‌లో హీరోలు మోహన్ లాల్, పృథ్వీ రాజ్ పాల్గొన్న పాట ఒక్కటి కూడా లేదు. తెలుగు ఆడియన్స్‌ను థ్రిల్ కలిగించడం కోసమే. ఇలా చిరంజీవి, సల్మాన్ సాంగ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ముంబైలో ఈ పాట షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోన్న విషయం తెలిసిందే.
‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి, నయనతార మరోసారి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసారు. ఈ సినిమాలో తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారు. . కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మోహన్ రాజా స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ గాడ్ ఫాదర్ చిత్రాన్ని (God Father Movie) ప్రజెంట్ చేస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసారు. ఈ సినిమాలో తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారు. తండ్రి తీస్తున్న సినిమాలో చెర్రీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈనెల 20న చిరంజీవి ఆచాార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మెగా అభిమానులంతా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.