salman khan బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరికాసేపట్లో జోధ్‌పూర్ కోర్డుకు హాజరు కానున్నారు. 21 ఏళ్ల క్రితం ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్.. తన తోటి నటీనటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం కొఠారీలతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడినట్టు సల్మాన్ ఖాన్ పై ఆరోపణలున్నాయి. ఈ విషయమై జోథ్‌పూర్ కోర్టు దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విషయమై.. సల్మాన్ ఖాన్ ఈ రోజు జోథ్‌పూర్ కోర్టులో హాజరు కానున్నారు. సల్మాన్ జోథ్‌పూర్‌కు వస్తున్న నేపథ్యంలో అతన్ని హతమారుస్తామంటూ గ్యారీషూటర్ పేరిట ఫేస్బుక్లో హెచ్చరికలు జారీ అవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఫోటోకు రెడ్ క్రాస్ మార్క్ చేసి 007 లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరిట ఈ పోస్ట్ చేశారు.
సల్మాన్‌ను వెంటాడుతున్న కృష్ణ జింకల కేసు (file photo)
ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా ఆయన బెయిల్ పై విడులయ్యారు. ఈ రోజు కోర్టు విచారణకు హాజరు కాకుంటే అతని బెయిల్‌ను రద్దు చేస్తామని ఇప్పటికే సెషన్స్ కోర్టు జడ్జి చంద్రకుమార్ సొంగార ప్రకటించారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఈ రోజు కోర్టుకు హాజరు కానున్నారు.