లూసీఫర్ రీమేక్‌లో చిరంజీవికి తోడుగా సల్మాన్ ఖాన్.. కానీ కండిషన్స్ అప్లై..

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ దశలోనే ఉండగానే చిరు మరో సినిమాకు ఓకే చెప్పారు. లూసీఫర్ రీమేక్‌లో చిరంజీవితో పాటు సల్మన్ ఖాన్ కూడా నటించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: May 3, 2020, 4:29 PM IST
లూసీఫర్ రీమేక్‌లో చిరంజీవికి తోడుగా సల్మాన్ ఖాన్.. కానీ కండిషన్స్ అప్లై..
చిరంజీవి,సల్మాన్ ఖాన్(File/Photo)
  • Share this:
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ దశలోనే ఉండగానే చిరు మరో సినిమాకు ఓకే చెప్పారు. గతేడాది మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీ హీరోగా నటించిన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిరంజీవి.  మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. తెలుగులో ఈ సినిమా డబ్ కూడా చేసారు. ఆ సంగతి పక్కనపెడితే..  ఈ సినిమాను చిరంజీవితో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో మంచి రేటుకు ఈ  రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే  విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  కాగా ఆ సినిమా తెలుగు రీమేక్‌ దర్శకత్వ బాధ్యతలు సుజిత్‌కు అప్పగించారు చిరంజీవి. ఇప్పటికే సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాడు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్  ఖాన్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి, రామ్ చరణ్‌తో సల్మాన్ ఖాన్ (File/Photo)


‘లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీ  రోల్ పోషించాడు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌తో  చేయించాలనుకున్నట్టు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చింది. తాజాగా సల్మాన్ ఖాన్ పేరును చిరంజీవి సూచించాడట. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఈ చిత్రంలో నటించడానికి  ఓ కండిషన్ పెట్టాడట. తెలుగులో తను ఈ పాత్రను చేస్తే.. హిందీ రీమేక్‌ హక్కులను తనకు ఇవ్వడంతో పాటు హిందీలో తాను చిరంజీవి పాత్రను చేస్తే.. తెలుగులో తాను చేసిన పాత్రను హిందీలో రామ్ చరణ్‌ చేయాలని కండిషన్స్ పెట్టాడట. మరి సల్మాన్  కండిషన్స్‌ను చిరంజీవి ఏ మేరకు ఒప్పకుంటాడా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 3, 2020, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading