హోమ్ /వార్తలు /సినిమా /

అభిమానులకు సల్మాన్ ఖాన్ షాక్.. కొత్త లుక్‌లో అదరగొడుతున్న భాయిజాన్..

అభిమానులకు సల్మాన్ ఖాన్ షాక్.. కొత్త లుక్‌లో అదరగొడుతున్న భాయిజాన్..

‘భారత్’లో సల్మాన్ ఖాన్

‘భారత్’లో సల్మాన్ ఖాన్

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ‘భారత్’ సినిమా చేస్తున్నాడు.కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి సల్మాన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు.

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ‘భారత్’ సినిమా చేస్తున్నాడు.కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోంది. దిశా పటానీ ఈసినిమాలో సల్మాన్ సోదరి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. టబు మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈసినిమాలో సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సల్మాన్ ఖాన్ ఏజ్డ్ క్యారెక్టర్‌తో ఉన్న లుక్‌ను చూసి ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్..20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల ముసలివాడిగా  ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ‘ఏ జర్నీ ఆఫ్ ఆ మ్యాన్ అండ్ నేషన్ టుగేదర్ అనేది ట్యాగ్‌లైన్. ఒక వ్యక్తి దేశం కోసం చేసే ప్రయాణమే ‘భారత్’ మూవీ. ఈ సినిమాలో సల్మాన్ పాత్ర పేరు కూడా ‘భారత్’ కావడం విశేషం.
‘సుల్తాన్’,‘టైగర్ జిందా హై’ సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, అలీ అబ్బాస్ జఫర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ తన ఫిల్మ్ కెరీర్‌లో చేయనటువంటి పాత్రను ఈ సినిమాలో చేసినట్టు సమాచారం. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘ ఓడ్ టూ మై ఫాదర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతుంది.  ఈ మూవీని ఈద్ కానుకగా జూన్ 5న  విడుదల కానుంది. ఈ సినిమాను ఒకేసారి హిందీతో పాటు తెలుగు,తమిళం, మలయాళంలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మొత్తానికి ‘భారత్’మూవీతో సల్మాన్ ఖాన్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.

First published:

Tags: Ali Abbas Zafar, Bharath, Bharath Movie Review, Bollywood, Disha Patani, Hindi Cinema, Katrina Kaif, Salman khan, Tabu

ఉత్తమ కథలు