Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 23, 2019, 6:40 PM IST
దబంగ్ 3 అఫీషియల్ పోస్టర్
కొన్ని సినిమాలు ఎలా ఉన్నా కూడా కేవలం బ్రాండ్‌తోనే ఆడేస్తుంటాయి. అలాంటి ఓ సినిమా దబంగ్. సల్మాన్ ఖాన్ హీరోగా అభినవ్ సిన్హా తెరకెక్కించిన ఈ చిత్రం పదేళ్ల కింద విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో గబ్బర్ సింగ్‌గా రీమేక్ చేసాడు పవన్ కల్యాణ్. ఇక ఆ తర్వాత దబంగ్ 2 కూడా వచ్చి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మూడో భాగం సిద్ధం చేసాడు సల్మాన్. ప్రభుదేవా దీనికి దర్శకుడు. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ వరస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో పోకిరి సినిమాను ‘వాంటెడ్’ పేరుతో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ఇచ్చాడు ప్రభుదేవా.

దబంగ్ 3 అఫీషియల్ పోస్టర్
ఈ చిత్రం తర్వాత సల్మాన్ వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు పదేళ్ల తర్వాత మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్, కామెడీ కంటే ముఖ్యంగా రివేంజ్ ఉంది. చుల్‌బుల్ పాండే బ్యాక్ కహానీ ఇందులో చూపిస్తున్నాడు ప్రభుదేవా. ఇప్పటి వరకు రెండు భాగాల్లోనూ చుల్‌బుల్ పాండేను చూపించిన సల్మాన్.. అసలు చుల్‌బుల్ పాండే ఎక్కడ్నుంచి వచ్చాడు.. ఆయన కహానీ ఏంటి అనేది దబంగ్ 3లో చూపిస్తున్నాడు.
ఇందులో సోనాక్షి సిన్హాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంది. ఈ సినిమాతో మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. పదేళ్ల కింద సోనాక్షిని కూడా ఇలాగే దబంగ్ సినిమాతో పరిచయం చేసాడు ఈయన. ఇప్పుడు సాయిని పరిచయం చేస్తున్నాడు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో సుదీప్ విలన్‌గా నటిస్తుండటం విశేషం. దబంగ్ 3 విడుదల కాకముందే సల్మాన్ ఖాన్‌తో రాధే సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు ప్రభుదేవా.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 23, 2019, 6:40 PM IST