అభిమాని అత్యుత్సాహం...ఫోన్ లాగేసుకున్న బాలీవుడ్ హీరో

తన అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకోబోయిన అభిమాని చేతిలోని ఫోన్‌ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లాగేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ తీరును కొందరు తప్పబడుతుండగా...మరికొందరు మాత్రం అభిమానిదే తప్పంటే సల్మాన్ ఖాన్‌కు బాసటగా నిలుస్తున్నారు.

news18-telugu
Updated: January 28, 2020, 6:43 PM IST
అభిమాని అత్యుత్సాహం...ఫోన్ లాగేసుకున్న బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్
  • Share this:
తన అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకోబోయిన అభిమానికి చుక్కలు చూపించాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. అభిమాని చేతిలో నుంచి ఫోన్‌ను లాగేసుకున్నాడు. గోవా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గోవాలో సల్మాన్ ఖాన్ చిత్రం ‘రాధే’ షూటింగ్‌లో పాల్గొనేందుకు గత వారం ఆయన ముంబై నుంచి గోవాకు వచ్చారు. సల్మాన్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ అభిమాని ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో బాలీవుడ్ కండలవీరుడికి పట్టరాని కోపం వచ్చింది. క్షణాల్లో అభిమాని చేతిలో నుంచి ఫోన్‌ను లాగేసుకుని, తన దారిలో తాను వెళ్లిపోయాడు.

సల్మాన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి ఓ విమానయాన సంస్థలో కింది స్థాయి ఉద్యోగిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని విమానాశ్రయ సీనియర్ అధికారి తెలిపారు. వైరల్ వీడియో ఆధారంగా తాము విచారణ జరిపామని, ఆ ఘటన జరిగినట్లు నిర్ధారించారు.

కాగా సల్మాన్ ఖాన్ తీరు పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెల్ఫీ తీసుకోబోయిన  అభిమాని పట్ల సల్మాన్ ఖాన్ దురుసుగా ప్రవర్తించడం సరికాదంటూ కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం అనుమతి లేకుండా సెల్ఫీలు దిగడం, సెలబ్రిటీలను ఇబ్బందిపెట్టడం సమర్థనీయం కాదంటున్నారు. తనను ఇబ్బందిపెట్టిన అభిమానికి సల్మాన్ ఖాన్ తగిన బుద్ధి చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు.

First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు