మన దేశంలో సినీ ఇండస్ట్రీ అనగానే bollywood గుర్తుకువస్తుంది. ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు box office వద్ద సందడి చేస్తుంటాయి. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ వంటి star heros సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ ఉంటుంది. కానీ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా lockdown విధించిన తరువాత షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. థియేటర్లు సైతం మూతబడటంతో హీరోలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సంవత్సరం బాలీవుడ్లో పెద్దసినిమాలు ఎక్కువగా విడుదల కాలేదు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో cinema shootings సైతం మళ్లీ మొదలవుతున్నాయి. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘అంతిమ్’ (Antim) సినిమా షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. ఈ సినిమాలో సల్మాన్ ఫస్ట్‌లుక్ తాజాగా బయటకు వచ్చింది. ఈ గెటప్ Salman Khan ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
* సోషల్ మీడియాలో వైరల్
అంతిమ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక సిక్కు పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. సల్మాన్‌తో పాటు అతడి బావ ఆయుష్ శర్మ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా అంతిమ్ సెట్స్‌లో తీసిన ఒక వీడియోను ఆయుష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఫార్మల్ లుక్‌లో.. పోలీస్ అఫీసర్ గెటప్‌లో ఉన్న సల్మాన్ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూరగాయల మార్కెట్ సెట్లో సిక్కుల తలపాగా ధరించి, ఫార్మల్ డ్రెస్‌లో సల్మాన్ నడుస్తూ వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అంతిమ్ సినిమా షూటింగ్ ప్రారంభమైందనే ట్యాగ్‌తో ఆయుష్ ఈ వీడియోను షేర్ చేశాడు.
* గత నెలలోనే ప్రారంభం
ఈ సినిమాలో గ్యాంగ్ వార్స్, ల్యాండ్ మాఫియాలను అంతం చేసే పోలీస్‌గా సల్మాన్ పాత్ర ఉంటుంది. దీపావళి తరువాత నవంబర్ 16న పుణెలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆయుష్ శర్మ, ఇతర బృందంపై ఒక ఛేసింజ్ సీక్వెన్స్ సీన్‌ను ఇటీవలే షూట్ చేశారు. ఆ తర్వాత కర్జాత్ (Karjat) లోని ND స్టూడియోస్‌లో, అనంతరం ముంబైకి దగ్గర్లోని వెర్సోవా (Versova)లో కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. ఈ 20 రోజుల షెడ్యూల్లో ఆయుష్ శర్మపై కీలక సన్నివేశాలు తీశారు. తాజాగా సల్మాన్ మూవీ సెట్స్‌కు వచ్చాడు. డిసెంబర్ 6 నుంచి ప్రారంభమైన షెడ్యూల్లో అతడు పాల్గొంటున్నాడు. ఈ సినిమాకు మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) దర్శకత్వం వహిస్తున్నాడు. నికితిన్ ధీర్ (Nikitin Dheer) ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించాడు.
Published by:Suresh Rachamalla
First published:December 10, 2020, 15:53 IST