వెంకీ సినిమాపై మోజు పడ్డ సల్మాన్...అంతేగా..అంతేగా..

తాజాగా తెలుగులో సూపర్ హిట్టైయిన ‘ఎఫ్ 2’ ఈ సినిమాను హిందీ, తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైనాయి. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శక, నిర్మాతలు, హీరోలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 31, 2019, 6:20 PM IST
వెంకీ సినిమాపై మోజు పడ్డ సల్మాన్...అంతేగా..అంతేగా..
వెంకటేష్, సల్మాన్ ఖాన్
  • Share this:
ఈ సంక్రాంతి బరిలో చాలా సైలెంట్‌గా బరిలో దిగి వైలెంట్‌గా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది ‘ఎఫ్ 2’.  దాదాపు రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా..రూ.125 కోట్ల గ్రాస్..రూ.80 కోట్ల షేర్‌ను సాధించి ఔరా అనిపించింది.

ఇప్పటికే ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలైనయాయి. ఈ సీక్వెల్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు రవితేజ మరో హీరోగా నటిస్తున్నట్టు సమాచారం.

తాజాగా తెలుగులో సూపర్ హిట్టైయిన ఈ సినిమాను హిందీ, తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైనాయి. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శక, నిర్మాతలు, హీరోలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

‘ఎఫ్ 2’ బాలీవుడ్ రీమేక్‌లో సల్మాన్, అక్షయ్ కుమార్‌లతో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైనాయి.  హిందీలో కూడా ఒక దిల్ ‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు.  ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మరోవైపు తమిళంలో ఈ సినిమాను సూర్య, కార్తిలు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిన ‘ఎఫ్2’ హిందీ, తమిళంలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.ఇవి కూడా చదవండి 

పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు తల్లైన హీరో కూతురు..ఆనందంలో కుటుంబ సభ్యులు

రజినీకాంత్ విలన్‌ను నమ్ముకున్న ఆ హీరో, దర్శకుడు..

సూపర్ స్టార్ స్టోరీతో.. రవితేజ కొత్త సినిమా...
First published: January 31, 2019, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading