కరోనా తెచ్చిన తిప్పులు తెలియనివి కావు. ఈ కరోనా ఒక్కో ఇండస్ట్రీని ఒక్కోరకంగా ఇబ్బుందులకు గురిచేస్తోంది. సినీ ఇండస్ట్రీ కూడా కరోనా దెబ్బకు కుదేలైంది. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. కొద్దిపాటి సడలింపులతో అనుమతులు ఇచ్చిన ఏవో చిన్న చిన్న సినిమాలు, సీరియల్స్‌కు సంబందించిన షూటింగ్స్ మాత్రమే జరుపుకుంటున్నాయి. పెద్ద పెద్ద హీరోలు షూటింగ్స్‌కు రావడం లేదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కూడా ఈ లాక్ డౌన్ కారణంగా కొంత కాలంగా తన ఫార్మ్ హౌజ్ లోనే ఉంటూ అక్కడే కాలం గడుపుతున్నాడు. దీనికి సంబందించిన చాలా వీడియోలను ఆయన చాలా సార్లు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తన గుర్రాలకు గడ్డి వేస్తూ.. అదే గడ్డిని సల్మాన్ తింటున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న తన ఫార్మ్ హౌజ్‌లో గడపడానికి ఎక్కువగా ఇక్కడే గడుపుతున్నాడు. తాజాగా ఓ వరినాట్లు వేస్తూ ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు.
A post shared by Salman Khan (@beingsalmankhan) on
ఆ ఫోటోలో సల్మాన్ ఒంటి నిండా బురద పూసుకుని.. రైతుల్నీ గౌరవించండి అంటూ రాసుకున్నాడు. ఇక మన తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ హౌజ్‌లో సల్మాన్ మాదిరే పశువులకు మేత వేయ్యడం, వాటిని దవ్వడం తెలిసిందే. దీంతో పవన్ అభిమానులు అరే అచ్చం మన పవర్ స్టార్ మాదిరే చేస్తున్నాడే అని చర్చించుకుంటున్నారు. ఇక సల్మాన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన, ప్రభు దేవా దర్శకత్వంలో 'రాధే' అనే సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.