కరోనా పై వ్యాక్సిన్ పై అపోహలు వద్దంటున్న సల్మాన్ ఖాన్ (News18/Photo)
Salman Khan | నిన్న మొన్నటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వద్దంటూ న్యూస్ 18కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Salman Khan | నిన్న మొన్నటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేసింది. ఈ రెండో వేవ్‌లో చాల ా మంది ఆక్సిజన్ అందక కన్నుమూసారు. ఇపుడిపుడే దేశ వ్యాప్తంగా పరిస్థితి కుదట పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న లాక్డౌన్ చర్యలైతే కానీ.. వ్యాక్సినేషన్ డ్రైవ్ వల్ల కానీ ఇపుడిపుడే దేశం కరోనా నుంచి కోలుకుంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో 18 యేళ్లు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజ.లు స్వచ్ఛందంగా కరోనా టీకా తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ టీకా పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. అవగాహన కల్పించారు. ఇప్పటికే కరోనా తొలి డోసు తీసుకున్న బాలీవుడ్ కండల వీరుడు.. కరోనాను జయించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. ఈ సందర్భంగా న్యూస్ 18కు ఎక్స్‌క్లూజివ్‌గా ఓ మినీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. కరోనా టీకాపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. వాక్సిన్ తీసుకుంటే ఏదో జరుగుతుందనే దుష్రచారాలను నమ్మవద్దు అని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరు వీలైనంత తొందరలో వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
మీరు వాక్సిన్ తీసుకుంటే.. మీతో పాటు మీ కుటుంబాన్ని, సమాజాన్ని అలాగే దేశం మొత్తాన్ని కాపాడిన వారవుతారని చెప్పుకొచ్చారు. అందరు వ్యాక్సిన్ తీసుకోవాలంటూ చేతులెత్తి నమస్కారం చేసారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్క్ ధరించడం.. సోషల్ డిస్టన్స్ పాటించాలన్నారు. ఎప్పటి కపుడు చేతులును శుభ్రం చేసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌తోనే కరోనాను ఈ దేశం నుంచి పారదోలవచ్చని పిలుపునిచ్చారు. సల్మాన్ ఖాన్ కోవిడ్ కష్ట కాలంలో తన వంతుగా సినీ కార్మికులకు అండగా నిలబడ్డ సంగతి తెలిసిందే కదా.
రీసెంట్గా ఈయన ’రాధే’ సినిమాతో పలకరించారు. ఓటీటీలో విడుదలైన ఈసినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు సల్మాన్ ఖాన్.. ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్ధా’తో పాటు షారుఖ్ హీరోగా నటిస్తోన్న ‘పఠాన్’లో క్యామియో రోల్ చేస్తున్నారు. మరోవైపు ఈయన ‘టైగర్ 3’ అనే సినిమా చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.