సల్మాన్ ఖాన్ సైలెంట్‌గా కనిపిస్తుంటాడు కానీ పైకి కనిపించేంత అమాయకుడు మాత్రం కాదు. కావాల్సిన సమయంలో పేలిపోయే పంచులు వేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు కండల వీరుడు. సాధారణంగా సెటైర్లు వేయడంలో ముందుంటాడు సల్మాన్. తన తోటి హీరోలపై కూడా అప్పుడప్పుడూ సెటైర్ల వర్షం కురిపిస్తుంటాడు సల్మాన్ ఖాన్. ఇప్పుడు మాత్రం ఈయన చూపులు ప్రియాంక చోప్రాపై పడ్డాయి. ఆమెను టార్గెట్ చేసి ఆడుకున్నాడు ఈ హీరో. తాజాగా ఈయన భారత్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. జూన్ 5న విడుదల కానుంది ఈ చిత్రం.

సల్మాన్ ఖాన్ ప్రియాంక చోప్రా
అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో ముందు ప్రియాంక చోప్రా హీరోయిన్. ఓ షెడ్యూల్ కూడా పూర్తైన తర్వాత సినిమా నుంచి తప్పుకుంది పిగ్గీ చోప్స్. దీనికి కారణం కూడా అప్పుడు పెళ్లి అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. సల్మాన్ ఖాన్ కూడా అప్పుడు ఇదే చెప్పాడు. అయితే ఇప్పుడు మాత్రం కాస్త సెటైర్లు వేసాడు కండల వీరుడు. ఈ చిత్రం కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చేది.. కానీ అక్కడ పాపం ప్రియాంక బిజీ.. అందుకే తమ కోసం అంత టైమ్ కేటాయించలేకపోయింది అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్.

సల్మాన్ ఖాన్ ప్రియాంక చోప్రా
ప్రమోషన్స్ సందర్భంగా ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. తమ కంటే ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఉండటంతో తమను వదిలేసి ప్రియాంక చోప్రా వెళ్లిపోయిందంటూ చెప్పాడు సల్మాన్ ఖాన్. మొత్తానికి ఇప్పుడు కండల వీరుడి మాటలు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయాయి. ప్రియాంక చోప్రా వెళ్లిపోయిన తర్వాత మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో ఈ సినిమాలో రొమాన్స్ చేసాడు సల్మాన్ ఖాన్. మరి ఇప్పుడు సల్మాన్ వ్యాఖ్యలపై ప్రియాంక ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో..?