Salman Khan - Radhe: సల్మాన్ ఖాన్ ‘రాధే’ దెబ్బకు క్రాష్ అయిపోయిన ‘జీ 5’ యాప్.. ఇంతకీ రివ్యూ ఎలా ఉందంటే..

సల్మాన్ ఖాన్ ‘రాధే’ రివ్యూ (Twitter/Photo)

Salman Khan - Radhe | సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘రాధే’. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. ఇక బాలీవుడ్‌లో భాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజు జీ 5 యాప్‌లో విడుదలైన ఈ సినిమా దెబ్బకు..

  • Share this:
    Salman Khan - Radhe | సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘రాధే’. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. ఇక బాలీవుడ్‌లో భాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాలకు నెగిటివ్ రివ్యూలు వచ్చిన రూ. 100 కోట్లు వసూళ్లు చేస్తూ ఉంటాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే’.ఈ సినిమాను ముందుగా ఒకేసారి థియేటర్స్‌తో పాటు డిజిటల్‌లో పే ఫర్ వ్యూ ప్రకారం రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక వీరు ప్రకటించిన సమయంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంత ఉదృతి లేదు. కానీ సల్మాన్ ఖాన్ తాను యాక్ట్ చేసిన చిత్రాన్ని ఈద్ సందర్భంగా రిలీజ్ చేయాలని ముందు నుంచి నిర్ణయించుకున్నారు. గత యేడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పటి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది. కానీ ఈ సారి మాత్రం ఈద్‌కు రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్న సల్మాన్ ఈ సినిమాను జీ 5లో మధ్యాహ్నం 12 గంటలకు స్ట్రీమింగ్ చేసారు.

    సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ మాస్ హీరో నటించిన సినిమా విడుదల అవ్వడంతో జీ 5 యాప్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. థియేటర్స్ విడుదలైతే.. ఆ రచ్చ మాములుగా ఉండదు. అలాంటిది ఓటీటీలో విడుదల కావడంతో దాదాపు 1 మిలియన్ పైగా వ్యూయర్స్ ఒక్కసారిగా హిట్స్ చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని జీ 5 వాళ్లు తెలియజేసారు. ఆ తర్వాత అంతా సద్దుకుంది.

    జీ 5లో విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్స్ తమదైన రివ్యూలు ఇస్తున్నారు. 80ల కాలం నాటి కథ, స్క్రీన్ ప్లే‌తో బోర్ కొట్టించారని చెబుతున్నారు.










    ఔట్ ఆఫ్ లా.. వాంటెట్ సినిమా హ్యంగోవర్ ఇంకా.. ప్రభుదేవా, సల్మాన్‌కు ఇంకా దిలేదని చెబుతున్నారు. పాటల్లో సీటీమార్ సాంగ్ మాత్రం ఆకట్టుకునేలా ఉందని చెబుతున్నారు.  మొత్తంగా సల్మాన్ ఖాన్.. తన అభిమానులు మెచ్చేలా  ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీ చేసినట్టు చెప్పుకొచ్చారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: