Salman Khan - Radhe Trailer Talk: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధే’. ప్రభుదేవా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘వాంటెడ్’. ఈ సినిమాకు ముందు సల్మాన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ‘పోకిరి’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు సల్మాన్ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత సల్మాన్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా చేసాడు. ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో నడవలేదు. పైగా ఈ సినిమాకు ప్యూర్ రివ్యూ రేటింగ్స్ వచ్చాయి. ‘టైగర్ జిందా హై’ తర్వాత సల్మాన్ ఖాన్.. సినిమా ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత రిలీజైన ‘రేస్ 3’ ‘భారత్’‘దబాంగ్ 3’ బ్యాడ్ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి.
ఈ సంగతి పక్కనపెడితే.. సల్మాన్ ఖాన్.. మూడోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. కరోనా లేకపోయి ఉంటే.. ఈ సినిమా గతేడాదే విడుదలై ఉండేది. కానీ ఈ సినిమాను ఈద్ సందర్భంగా మే 13 తేదిన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న ఈ సమయంలో ఈ చిత్రాన్ని ఒకేసారి థియేటర్స్‌తో పాటు ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. జీ 5లో పే ఫర్ వ్యూ ఆధారంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన దిశా పటానీ నటిస్తోంది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ప్రభుదేవా ఈ సినిమాను పోకిరి సినిమాకు సీక్వెల్ తీసినట్టు కనబడుతోంది. దానికి అల్లు అర్జున్ డీజేతో పాటు మరికొన్ని సినిమాల సీన్స్‌ను రాసుకొని ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించాడు. ‘రాధే’ సినిమాకు ట్యాగ్ లైన్‌గా ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ అని ఉంది. ఈ సినిమాలో కూడా ముంబైలో అండర్ వాల్డ్ వాళ్ల ప్రభావంతో నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తాయి. ఈ నేపథ్యంలో రాధే అనే వ్యక్తి గతంలో ముంబై మాఫియాను అంతం చేసాడు. ఇపుడు మళ్లీ అతన్ని నియమిస్తే క్రైమ్ రేట్ తగ్గిస్తాడని పోలీసులు భావిస్తారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగం ఒదిలిపెట్టిన హీరో.. మళ్లీ ఖాకీ డ్రెస్ వేసుకొని ముంబై మాఫియాను ఎలా నిర్మూలించగలిగాడనేదే ఈ సినిమా స్టోరీ. మరోవైపు ఈ సినిమా డీజే సినిమాలోని సీటీమార్ పాటను ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ వాడుకున్నాడు. రింగ , రింగ తర్వాత మరోసారి బన్ని పాటను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు భాయ్.
#RADHE TRAILER... #Radhe will be the first #Hindi biggie to opt for a multi-platform release... Theatrical and digital release *simultaneously*... This #Eid... #SalmanKhan #RadheTrailer: https://t.co/bjlunlLPM0
— taran adarsh (@taran_adarsh) April 22, 2021
ఈ సినిమాకు సంబంధించిన హక్కులను జీ స్టూడియోస్ భారీ రేటుకు దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్, సాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలిపి రూ. 230 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే చిత్రానికి విడుదలకు ముందే మంచి రేటు దక్కించుకుంది. కరోనా టైమ్‌లో ఓ సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం రికార్డు అని చెబుతున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఇదంత సల్మాన్ ఖాన్‌కు మాస్‌లో ఫాలోయింగ్‌కు నిదర్శనం అని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ తన చిత్రాలను తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషల్లో ఏకకాలంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. ఇదే కోవలో ‘రాధే’ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో మే 13న రిలీజ్ చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Prabhu deva, Salman khan