హోమ్ /వార్తలు /సినిమా /

Salman Khan - Radhe: సల్మాన్ ‘రాధే’ మరో చెత్త రికార్డు.. మరోవైపు భాయ్ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్స్ పిలుపు..

Salman Khan - Radhe: సల్మాన్ ‘రాధే’ మరో చెత్త రికార్డు.. మరోవైపు భాయ్ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్స్ పిలుపు..

సల్మాన్ ఖాన్ ‘రాధే’ అత్యంత చెత్త రికార్డు (Twitter/Photo)

సల్మాన్ ఖాన్ ‘రాధే’ అత్యంత చెత్త రికార్డు (Twitter/Photo)

Salman Khan - Radhe | సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘రాధే’. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమాకు IMDBతో పాటు నెటిజన్స్ ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటే నెటిజన్స్ పిలుపు నిచ్చారు.

  Salman Khan - Radhe | సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘రాధే’. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. ఇక బడా స్టార్ హీరో సినిమా విడుదలైందంటే అభిమానుల కోలాహలం పాటు కొన్ని వివాదాలు కూడా చుట్టుముడుతూ ఉంటాయి. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ మూవీ ఈద్ సందర్భంగా ఒక రోజు ముందుగా జీ 5 ఓటీటీలో పే ఫర్ వ్యూ పద్ధతిన స్ట్రీమింగ్ చేసారు. ఇక బాలీవుడ్‌లో భాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాలకు నెగిటివ్ రివ్యూలు వచ్చిన రూ. 100 కోట్లు వసూళ్లు చేస్తూ ఉంటాయి. ముందుగా  ఈ చిత్రాన్ని ఒకేసారి థియేటర్స్‌తో పాటు డిజిటల్‌లో పే ఫర్ వ్యూ ప్రకారం రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక వీరు ప్రకటించిన సమయంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంత ఉదృతి లేదు. కానీ సల్మాన్ ఖాన్ చివరకు శుక్రవారం రోజున మధ్యహ్నం 12 గంటలకు స్ట్రీమింగ్ చేసారు.

  మరోవైపు పే ఫర్ వ్యూకు రూ. 249 రూపాయలు పెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చింది. టిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్స్ తమదైన రివ్యూలు ఇస్తున్నారు. 80ల కాలం నాటి కథ, స్క్రీన్ ప్లే‌తో బోర్ కొట్టించారని చెబుతున్నారు.  ఐతే.. సల్మాన్ ఖాన్ వంటి బడా స్టార్ హీరో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో అందరు ఒకేసారి జీ 5 యాప్‌లోకి లాగిన్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా జీ 5 యాప్ క్రాష్ అయిపోయింది. మరోవైపు దుబాయ్, ఓవర్సీస్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు నెటిజన్స్‌ నిరసన సెగ తగిలింది. కొంత మంది నెటిజన్స్.. సల్మాన్ నటించిన ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ట్విట్టర్ వేదికగా ట్రెండ్ చేస్తున్నారు.

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు అవకాశాలు లేకుండా చేయడంలో సల్మాన్ ఖాన్ హస్తం ఉందని నెటిజన్స్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. సుశాంత్ మృతికి సల్మాన్ ఖాన్ కారణమంటూ మండిపడుతున్నారు. మరోవైపు రూ. 249 పెట్టి ఈ కమర్షియల్ సినిమా చూడటం దండగ అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. సుశాంత్ సింగ్ దెబ్బకు సల్మాన్ ఖాన్ తన చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేసాడనే కామెంట్స్ పెడుతున్నారు.

  అంతేకాదు చాలా మంది నెటిజన్స్ ఈ సినిమాను టెలిగ్రామ్ యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని .. ఆ లింకులను తమ బంధు మిత్రులకు షేర్ చేస్తున్నారు. మొత్తంగా జీ 5 లో ఈ సినిమా పే ఫర్ వ్యూ పద్ధతిని ఎపుడైతే విడుదలయ్యిందో అపుడే  హెచ్‌డీ పైరసీ ప్రింట్స్ నెటింట్ల దర్శనమిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ IMDB ఇండియన్ మూవీ డేటా బేస్ ఈ సినిమాకు అతి తక్కువగా 2.2 /10 రేటింగ్ ఇచ్చింది. ఎంత చెత్త సినిమా కైనా.. 4 నుంచి 5 ఇచ్చే ఈ సంస్థ ఈ సినిమాకు మాత్రం అతి తక్కువగా 10కి  2.2 రేటింగ్ ఇచ్చి సల్మాన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. మొత్తంగా ఈ యేడాది విడుదలైన చిత్రాల్లో అత్యంత చెత్త చిత్రంగా ‘రాధే’ సినిమా నిలిచిపోయింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Disha Patani, Prabhu deva, Salman khan

  ఉత్తమ కథలు