హోమ్ /వార్తలు /సినిమా /

Salman - Allu Arjun: అల్లు అర్జున్ పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు.. రాధే టీమ్‌కు బన్ని థాంక్స్..

Salman - Allu Arjun: అల్లు అర్జున్ పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు.. రాధే టీమ్‌కు బన్ని థాంక్స్..

Salman - Allu Arjun: అల్లు అర్జున్ పై  సల్మాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే... సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ..

Salman - Allu Arjun: అల్లు అర్జున్ పై  సల్మాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే... సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ..

Salman - Allu Arjun: అల్లు అర్జున్ పై  సల్మాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే... సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ..

  Salman - Allu Arjun: అల్లు అర్జున్ పై  సల్మాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే... సల్మాన్ ఖాన్ ప్రస్తుతం .. ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఈద్ సందర్భంగా థియేటర్స్‌తో పాటు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకోవైపు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ కొంత మంది నెటిజన్లు పిలుపునిచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు సల్మాన్ ఖాన్ కారణం అంటూ రాధే సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. దాంతో  పాటు కరోనా లాంటి సంక్షోభ సమయంలో సినిమా విడుదల చేయాల్సిన అవసరం ఉందా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో సీటీమార్ సాంగ్‌ను విడుదల చేసారు.  అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘డీజే’ సినిమాలోని సీటీమార్ సాంగ్‌ను హిందీలో ట్యూన్ ఇచ్చారు దేవీశ్రీ ప్రసాద్.

  ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ రేంజ్‌లో కాకపోయినా.. తన ఏజ్‌కు మించి సల్మాన్  ఈ పాటలో దిషా పటానీతో కలిసి ఇరగదీసాడు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్.. ఈ పాటలో అద్భుతంగా డాన్స్ చేసిన అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా ప్రశంసల ఝల్లు కురించారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా ఇంట్లో సేఫ్‌గా ఉండాలంటూ అల్లు అర్జున్‌కు సూచించారు.

  మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రశంసలతో అల్లు అర్జున్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మీలాంటి బడా స్టార్ నా డాన్స్ మెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు బన్ని.

  ఈ సినిమాను ఈద్ సందర్భంగా మే 13 తేదిన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న ఈ సమయంలో ఈ చిత్రాన్ని  ఒకేసారి థియేటర్స్‌తో పాటు ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. జీ 5లో పే ఫర్ వ్యూ ఆధారంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘రాధే’ సినిమాను  ప్రభుదేవా  డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘వాంటెడ్’. ఈ సినిమాకు ముందు సల్మాన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ‘పోకిరి’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు సల్మాన్‌ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత సల్మాన్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా చేసాడు. ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో నడవలేదు. ఇపుడు రాబోతున్న ‘రాధే.. ది మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి.

  First published:

  Tags: Allu Arjun, Bollywood news, Devi Sri Prasad, Disha Patani, Prabhudeva, Salman khan, Tollywood

  ఉత్తమ కథలు