అమితాబ్ తర్వాత బాలీవుడ్‌లో ఆ రికార్డు సల్మాన్‌కు మాత్రమే సాధ్యం అయింది..

HBD SalmanKhan | అవును బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ రికార్డు సల్మాన్ ఖాన్‌కు మాత్రమే సాధ్యం అయింది. వివరాల్లోకి వెళితే.. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 27, 2019, 3:39 PM IST
అమితాబ్ తర్వాత బాలీవుడ్‌లో ఆ రికార్డు సల్మాన్‌కు మాత్రమే సాధ్యం అయింది..
అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ (Twitter/photos)
  • Share this:
అవును బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ రికార్డు సల్మాన్ ఖాన్‌కు మాత్రమే సాధ్యం అయింది. వివరాల్లోకి వెళితే.. 1988లో ‘బీవీ హోతో ఐసీ’ సినిమాతో నటుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సల్మాన్ ఖాన్.ఆ తర్వాత సూరజ్ ఆర్. బర్జాత్యా డైరెక్షన్‌లో చేసిన ‘‘మైనే ప్యార్ కియా’’ తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో సల్మాన్..ప్రేమ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఇదే సినిమాను తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా డబ్ చేస్తే ఇక్కడ కూడా ఓ రేంజ్‌లో హిట్టైయింది.ఆ తర్వాత మరోసారి సూరజ్.ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో చేసిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సినిమాలో మరోసారి ప్రేమ్ పాత్రతో అలరించాడు. ఈ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే  ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.ఆ తర్వాత మూడోసారి సూరజ్ బర్జాత్యా డైరెక్షన్‌లొ చేసిన మూడో సిన్మా ‘‘హమ్ సాథ్ సాథ్ హై’’ సినిమాలో మరోసారి ప్రేమ్ క్యారెక్టర్ తో మరో హిట్టును అందుకున్నాడు. ఆ తర్వాత నాల్గోసారి సూరజ్.ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో చేసిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాలో ప్రేమ్ పాత్రతో ఆడియన్స్‌కు ప్రేమను పంచాడు.

Maine Pyar Kiya star Bhagyashree second innings with shivani debut movie
‘మైనే ప్యార్ కియా’లో తొలిసారి ప్రేమ్ పాత్రలో కనిపించిన సల్మాన్ ఖాన్ (Twitter/Photos)


తాజాగా సల్మాన్ ఖాన్..సూరజ్ ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో మరోసారి ప్రేమ్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రేమ్ పాత్ర చేసిన ప్రతిసారి సల్మాన్ ఆడియన్స్ మనుసులు దోచుకున్నాడు. ఒక్క సూరజ్ ఆర్. బర్జాత్యా దర్శకత్వంలో చేసిన సినిమాలోనే కాదు..‘అందాజ్ అప్నా అప్నా’, ‘జుడ్వా’, ‘దీవానా మస్తానా’, ‘బీబీ నెంబర్ 1, సిర్ఫ్ తుమ్’, ‘ఛల్ మేరే భాయి’,‘కహా ప్యార్ నా హో జాయే’’, నో ఎంట్రీ, పార్ట్ నర్, మేరీ గోల్డ్, ‘రెడీ’ వంటి సినిమాల్లో 15 సార్లుకు పైగా ప్రేమ్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. బాలీవుడ్‌లో అమితాబ్ తర్వాతి తరంలో ఒక కథానాయకుడు ఇన్ని సినిమాల్లో ఒకే పేరుతో నటించడం ఒక రికార్డు అనే చెప్పాలె.

First published: December 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు