విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్.. వచ్చిన కన్ఫర్మేషన్..

Bhagyashree: తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ విడాకుల కల్చర్ బాగా పెరిగిపోతుంది. మనోజ్, శ్వేతాబసు లాంటి వాళ్లు ఇప్పటికే డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా ఇదే పని చేసింది. ఆమె మరెవరో కాదు భాగ్య శ్రీ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 28, 2020, 1:17 PM IST
విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్.. వచ్చిన కన్ఫర్మేషన్..
ప్రతీతాత్మక చిత్రం (bhagyasree divorce)
  • Share this:
సినిమా వాళ్ల బంధాలు మరీ నీటి మీద రాతల కంటే దారుణంగా మారిపోతున్నాయి. కలిసున్నంత సేపు పట్టడం లేదు విడిపోవడానికి. నిన్నటికి నిన్న కొంకణసేన్ శర్మ విడాకులు తీసుకున్న విషయం ఇంకా మరిచిపోలేదు అప్పుడే మరో హీరోయిన్ కూడా విడాకుల బాట పట్టేసింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ విడాకుల కల్చర్ బాగా పెరిగిపోతుంది. మనోజ్, శ్వేతాబసు లాంటి వాళ్లు ఇప్పటికే డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా ఇదే పని చేసింది. ఆమె మరెవరో కాదు భాగ్య శ్రీ.. మైనే ప్యార్ కియా సినిమాతో దేశాన్ని కుదిపేసింది ఈమె. ఈ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ మామూలుగా పెరగలేదు. అయితే కొన్ని సినిమాలు మాత్రమే చేసి సడన్‌గా పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయింది.

భాగ్య శ్రీ విడాకులు (bhagyasree divorce)
భాగ్య శ్రీ విడాకులు (bhagyasree divorce)


మైనే ప్యార్ కియా తెలుగులో ప్రేమ పావురాలుగా విడుదలై ఇక్కడా సంచలన విజయం సాధించింది. ఒక్క సినిమాతోనే ఆమె నేషనల్ వైడ్‌గా తిరుగులేని క్రేజీ హీరోయిన్ అయిపోయింది ఈమె. కానీ ఊహించని విధంగా మైనే ప్యార్ కియా తర్వాత గుర్తింపు అయితే వచ్చింది కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఆ సినిమా వచ్చి 30 ఏళ్లు దాటేసినా కూడా ఇప్పటికీ భాగ్య శ్రీ అంటే ప్రేమ పావురాలు హీరోయిన్ అంటారు. ఆ తర్వాత ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. అంతా బాగానే ఉందనుకుంటున్న ఈ సమయంలో ఇప్పుడు తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది ఈ సీనియర్ హీరోయిన్. తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త, నటుడు అయిన హిమాలయా దస్సానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది భాగ్య శ్రీ.

భాగ్య శ్రీ విడాకులు (bhagyasree divorce)
భాగ్య శ్రీ విడాకులు (bhagyasree divorce)
ఇంత చిన్న వయసులో ప్రేమేంటి.. పెళ్లేంటి అంటూ కొందరు ప్రశ్నించినా కూడా ఈమె ఎవరి మాటా వినలేదు. ప్రేమించిన వాడి కోసం అప్పట్లో ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ మధ్యే మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టింది భాగ్య శ్రీ. భర్తతో విడిపోయిన తర్వాతే మళ్లీ సినిమాల్లో నటించడానికి ఒప్పుకుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అదే నిజమైంది కూడా. అయితే అతడితో విడిపోవడం చాలా బాధగా ఉందని చెప్పిన భాగ్య శ్రీ.. తన మసస్సు కుంగిపోయిన సంఘటనలు జరగడం వల్లే విడిపోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ఏడాదిన్నర కిందే తాము విడిపోయినట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది భాగ్య శ్రీ.
First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు