Salman Khan: సల్మాన్ ఖాన్ నివాసంలో కరోనా కల్లోలం.. హోం క్వారంటైన్లోకి కండల వీరుడు

ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నివాసంలో కరోనా కల్లోలం సృష్టించింది. సల్మాన్ వ్యక్తిగత డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ముందు జాగ్రత్తగా సల్మాన్ ఖాన్ హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు.

news18-telugu
Updated: November 19, 2020, 3:36 PM IST
Salman Khan: సల్మాన్ ఖాన్ నివాసంలో కరోనా కల్లోలం.. హోం క్వారంటైన్లోకి కండల వీరుడు
సల్మాన్ ఖాన్
  • Share this:
మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభన ఇంకా ఆగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు తాజాగా మరో 45 వేల కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నివాసంలో కరోనా కల్లోలం సృష్టించింది. సల్మాన్ వ్యక్తిగత డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ముందు జాగ్రత్తగా సల్మాన్ ఖాన్ హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. దాదాపు 14 రోజుల పాటు తాను హోం క్వారంటైన్లో ఉంటానని ఆయన తెలిపారు.

అయితే కరోనా సోకిన తన సిబ్బందిని సల్మాన్ ముంబైలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..  లాక్ డౌన్ సమయంలో సల్మాన్ తన కుటుంబంతో కలిసి పన్వెల్ లోని తన ఫామ్ హౌస్ లో గడిపారు. వ్యవసాయ పనుల్లో పాల్గొంటూ కాలక్షేపం చేశారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకు కొన్ని వీడియోలను సైతం ఆయన అక్కడి నుంచి విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయిందనే భావన దేశంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజల్లో ఉంది. ఈ కారణంగానే చాలామంది కరోనా రాకుండా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించడం లేదనే వాదన కూడా ఉంది. అయితే కరోనా మహమ్మారి ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని ఢిల్లీలో నమోదవుతున్న కొత్త కేసులు, మరణాలను బట్టి అర్థమవుతోంది. కొద్దిరోజులుగా ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇది మరింతగా పెరిగింది.

నిన్న ఒక్కరోజే దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. నిన్న 131 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఢిల్లీలో ఇప్పటివరకు ఇదే అత్యధికమని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆ రాష్ట్రంలో కొత్తగా 7486 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాజధాని నగరంలో కరోనా కేసులు 5 లక్షలు దాటాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో నిన్న 62 వేల కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 12.03 శాతం మందికి పాజిటివ్ వచ్చింది.
Published by: Nikhil Kumar S
First published: November 19, 2020, 3:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading