HOME »NEWS »MOVIE »salman khan hilariously refuses to eat cake at his bodyguard birthday celebrations mnj

Salman Khan: తినేశాలే.. చాలా బావుంది.. బాడీగార్డ్‌తో కండ‌ల‌వీరుడి ఆట‌లు.. వీడియో వైర‌ల్

Salman Khan: తినేశాలే.. చాలా బావుంది.. బాడీగార్డ్‌తో కండ‌ల‌వీరుడి ఆట‌లు.. వీడియో వైర‌ల్
స‌ల్మాన్ ఖాన్

త‌మ వ‌ద్ద ప‌నిచేసేవారంటే సినీ ప్ర‌ముఖుల‌కు చాలా అభిమానం. ముఖ్యంగా త‌మ‌కు ఏం కాకుండా చూసుకునే బాడీగార్డ్‌లంటే వారికి ప్ర‌త్యేక ఇష్టం. అందుకే త‌మ బాడీగార్డ్‌ల బ‌ర్త్‌డేలు చేయ‌డంతో పాటు వారికి బ‌హుమ‌తుల‌ను ఇస్తుంటారు సెల‌బ్రిటీలు. వారిలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్(Salman Khan)

  • Share this:
    Salman Khan: త‌మ వ‌ద్ద ప‌నిచేసేవారంటే సినీ ప్ర‌ముఖుల‌కు చాలా అభిమానం. ముఖ్యంగా త‌మ‌కు ఏం కాకుండా చూసుకునే బాడీగార్డ్‌లంటే వారికి ప్ర‌త్యేక ఇష్టం. అందుకే త‌మ బాడీగార్డ్‌ల బ‌ర్త్‌డేలు చేయ‌డంతో పాటు వారికి బ‌హుమ‌తుల‌ను ఇస్తుంటారు సెల‌బ్రిటీలు. వారిలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల త‌న బాడీగార్డ్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను చేశారు స‌ల్మాన్. ఈ సంద‌ర్భంగా బాడీగార్డ్ పెట్టిన కేక్‌ని తిన‌కుండా అత‌డిని ఆట ప‌ట్టించారు. దానికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.    ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో మూవీ షూటింగ్‌లో ఉన్న స‌ల్మాన్.. అక్క‌డే త‌న బాడీగార్డ్ జ‌గ్గీ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా అంద‌రితో పాటు జ‌గ్గీకి హ్యాపీ బ‌ర్త్‌డే పాట‌ను పాడారు స‌ల్మాన్. ఇక కేక్‌ని క‌ట్ చేసిన జ‌గ్గీ మొద‌ట‌గా స‌ల్మాన్‌కి పెట్టాల‌నుకోగా.. దాని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన కండ‌ల‌వీరుడు, తిన‌కుండా తిన్న‌ట్లు న‌టించారు. అంతేకాదు బావుంది బావుంది అంటూ కామెంట్ పెట్టారు. ఇక స‌ల్మాన్ చేష్ట అక్క‌డున్న అంద‌రినీ న‌వ్వించింది. ఈ వీడియోను ప్ర‌ముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫ‌ర్ వైర‌ల్ బాయాని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టేవారు రూల్స్‌ని అతిక్ర‌మించ‌రు అంటూ కామెంట్ పెట్టారు. ఈ వీడియో కండ‌ల వీరుడి అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. బాయ్ చాలా కూల్ అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ రాధే చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుదేవా ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
    Published by:Manjula S
    First published:December 14, 2020, 17:05 IST