• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SALMAN KHAN GIFTED RS 55 LAKH RUPEES HOME TO PLATFORM SINGER RANU MANDAL AND GIVEN CHANCE TO DABANG 3 MOVIE TA

ఫ్లాట్‌ఫామ్ సింగర్‌కు సల్మాన్ భారీ బహుమతి.. ‘దబాంగ్ 3’లో ఛాన్స్..

ఫ్లాట్‌ఫామ్ సింగర్‌కు సల్మాన్ భారీ బహుమతి.. ‘దబాంగ్ 3’లో ఛాన్స్..

రాణు మండల్,సల్మాన్ ఖాన్

ఫ్లాట్ ఫామ్ సింగర్‌గా పాపులర్ అయిన రనూ మండల్ గాన మాధర్యానికి ముగ్దుడైన సల్మాన్ ఖాన్.. తన లేటెస్ట్ మూవీ ‘దబాంగ్‌3’లో ఒక పాట పాడటానికి అవకాశం ఇచ్చాడట.

  • Share this:
    కూటి కోసం కోటి తిప్పలన్నట్టు.. ఏదో పొట్టకూటి కోసం రైల్లలో ఏదో కూని రాగాలు తీసుకునే నాలుగు డబ్బులు వస్తే అదే పరమాందంగా ఫీలయ్యే రను మండల్ అనే ఫ్లాట్‌ఫామ్ సింగర్.. ప్రతి రోజు  వెస్ట్ బెంగాల్‌లోని రణాఘాట్ రెల్వే స్టేషన్‌లో ఎక్కి లతాజీ పాటలు పాడి డబ్బులు అడుక్కోవడం ఆమె దినచర్య. ఎప్పటిలాగే ఓ రోజు వెస్ట్ బెంగాల్‌లోని రణాఘాట్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కి లతాజీ పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’  పాట పాడుతూ ఉండగా ఒక నెటిజన్ ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ వీడియో కాస్తా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు గాయకుడైన హిమేష్ రేష్మియా చూశాడు. అంతేకాదు వెంటనే ఆమె ఎక్కుడుంటుందో కనుక్కొని.. ఎలాగైతేనేం ఆమెను పట్టుకున్నాడు. అంతేకాదు తాను కంపోజ్ చేస్తున్న ‘తేరీ మేరీ కహాని’ సినిమాలో గాయనిగా ఆఫర్ ఇచ్చాడు.

    Woman Whose Rendition of Lata Mangeshkar Classic Went Viral Records Song for Himesh Reshammiya,himesh reshmiya,Himesh Reshammiya beggar song,Himesh Reshammiya beggar song duet,Himesh Reshammiya beggar lata mangeshkar song,himesh,ranu mondal himesh reshmiya video,ranu mondal and himesh reshammiya,himesh reshmiya hits,ranu mondal himesh reshmiya,himesh reshmiya hindi songs,ranu mondal and himesh reshmiya,teri meri kahani by ranu mandal and himesh reshmiya,himesh reshmiya movie,himesh reshammiya,ranu and himesh reshmiya,himesh reshmiya non stop,himesh reshmiya new song,himesh reshmiya teri meri,హిమేష్ రేష్మియా,హిమేష్ రేష్మియా,బిచ్చగత్తె,గాయకురాలిగా మారిన బిచ్చగత్తె,
    పాట పాడుతున్న బిచ్చగత్తే


    అంతేకాదు ఆమెతో కలిసి డ్యూయట్ కూడా పాడాడు. అంతేకాదు ఆ పాటను  హిమేష్ రేష్మియా తన  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ఇపుడా వీడియో సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. అంతేకాదు రనూ మండల్ రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది.  ఇక ఈ సినిమాలో  ఈ పాట  పాడినందకు రనూ మండల్‌కు హిమేష్ రేష్మియా దాదాపు రూ.6  నుంచి 7 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఇక రనూ మండల్ గాన మాధర్యానికి ముగ్దుడైన సల్మాన్ ఖాన్.. తన లేటెస్ట్ మూవీ ‘దబాంగ్‌3’లో ఒక పాట పాడటానికి అవకాశం ఇచ్చాడట. అంతేకాదు ఆమె కోసం ఏకంగా 55 లక్షల విలువైన ఇంటిని బహుమానంగా ఇచ్చినట్టు సమాచారం. ఏమైనా ఒక్క పాటతో ఓవర్ నైట్ పాపులర్ అయిన రనూ మండల్ టాలెంట్‌‌తో పాటు సల్మాన్ ఔదార్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు