హోమ్ /వార్తలు /సినిమా /

Salman Khan: గుండెపోటుతో సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే మృతి

Salman Khan: గుండెపోటుతో సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే మృతి

Sagar pandey death Photo Twitter

Sagar pandey death Photo Twitter

Sagar Pandey death: బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో మరణించారు. ముంబైలో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) డూప్ సాగర్ పాండే (Sagar Pandey death) గుండెపోటుతో మరణించారు. ముంబైలో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 1.00 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ప్రస్తుతం సాగర్ పాండే వయస్సు సుమారు 50 సంవత్సరాలు. సల్మాన్ ఖాన్‌తో కలిసి 50కి పైగా చిత్రాలలో కనిపించారు సాగర్ పాండే. 'బజరంగీ భాయిజాన్', 'ట్యూబ్‌లైట్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'దబాంగ్', 'దబాంగ్ 2', 'బిగ్ బాస్' వంటి టీవీ షోలలో సల్మాన్ ఖాన్ కోసం సాగర్ పాండే డూప్ గా పని చేశారు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా స్టేజ్ షోలు చేసి పలువురి మెప్పు పొందారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో సాగర్ పాండే జనించారు. ఆయన అంత్యక్రియలు ప్రతాప్‌గఢ్‌లో జరుగనున్నాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడిన సాగర్ పాండే.. సల్మాన్ ఖాన్ సాయం పొందారు. సాగర్ పాండే మరణ వార్త తెలిసి సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సంపాదించిన సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. చిరంజీవి హీరోగా రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మోహన్ రాజా (Mohan Raj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Bollywood, Bollywood actor, Salman khan

ఉత్తమ కథలు