బాహుబలి 2 పై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..

మన తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘బాహుబలి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన దేశ పరంగా అన్ని రికార్డులను క్రాస్ చేసింది. ఐతే ఈ సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియదని సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

news18-telugu
Updated: May 30, 2019, 12:40 PM IST
బాహుబలి 2 పై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..
సల్మాన్, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు
  • Share this:
మన తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘బాహుబలి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన దేశ పరంగా అన్ని రికార్డులను క్రాస్ చేసింది. ఐతే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘బాహుబలి  ది బిగినింగ్’ విడుదలయ్యాక..కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న దేశ వ్యాప్తంగా ప్రేక్షకులతో పాటు సినిమా సెలబ్రిటీలను ఆలోచింప చేసింది. ఐతే..బాహుబలి 2లో కట్టప్ప..బాహుబలిని ఎందుకు చంపాడన్న దానికి సమాధానం లభించింది. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్‌ సల్మాన్‌ఖాన్..ఇప్పటికే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియదన్నారు. తాజాగా సల్మాన్.. తను యాక్ట్ చేసిన ‘భారత్’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Salman khan doesn't know about why kattappa killed bahubali,salman khan,prabhas,salman khan prabhas bahubali,salman khan twitter,salman khan instagram,prabhas instagram,salman khan does not know why kattappa killed bahubali,salman khan sensational comments on bahubali 2,bahubali 2,baahubali 2,bahubali,baahubali,salman khan tubelight,bahubali 3,salman khan movies,baahubali 2 songs,prabhas,salman khana watch bahubali2,katappa ne bahubali ko kyu mara,salman khan about baahubali,salman khan about baahubali 2,salmana khan bahubali 2 shock,baahubali 2 trailer,rana daggubati,bahubali 3 salman khan trailer,bahubali 3 cast,kattappa,bahubali 2 songs,bahubali 3 trailer,ప్రభాస్ బాహుబలి 2,సల్మాన్ ఖాన్,భారత్,బాహుబలి 2 పై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు,కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు,
బాహుబలిని వెన్నుపోటు పొడిచిన కట్టప్ప


ఈ సందర్భంగా సౌత్ సినిమాల గురించి ఓ విలేఖరి ఒక ప్రశ్న అడిగారు. మీరు బాహుబలి రెండు పార్టులు చూసారా అని ప్రశ్న వేసాడు. దానికి సల్మాన్ ఖాన్.. ‘బాహుబలి..ది బిగినింగ్’ మాత్రమే చూసాను. రెండో పార్ట్ చూడలేదన్నాడు. అందుకే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తనకు ఇప్పటికీ తెలియదన్నాడు. అసలు రెండో భాగంలో ఏం జరిగిందో కూడా నాకు తెలియదన్నాడు. ఎపుడు సినిమాలతో బిజీగా ఉండే సల్మాన్.. బాహుబలి రెండో పార్ట్ చూడకపోవడం పెద్ద విషయం కాదంటున్నారు కొంత మంది క్రిటిక్స్. ఇక సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ‘భారత్’ విషయానికొస్తే.. ఈ సినిమాను రంజాన్ కానుకగా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్,దిశాపటానీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అంతేకాదు సల్మాన్.. ఈ సినిమాలో ఐదు పాత్రల్లో కనిపించనున్నాడు.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>