ఒకే తెరపై ఇద్దరు స్టార్ హీరోలు కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా అనేది సగటు ప్రేక్షకుడి ఫీలింగ్. ఆ ఇద్దరు స్టార్ హీరోలు వేరు వేరు ఇండస్ట్రీలకు చెందిన వారు అయితే రేంజ్ మరోలా ఉంటుంది. ఇక వాళ్లిద్దరూ కలిసి చిందేస్తే అంతా షేక్ కావాల్సిందే. తాజాగా సల్మాన్ ఖాన్ (Salman Khan), విక్టరీ వెంకటేష్ (Venkatesh) విషయంలో అదే జరుగుతోంది. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చిందేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి చిందేసి యమ కిక్కిచ్చిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఇప్పుడు వెంకీ మాటతో కలిసి ఇరగదీసే స్టెప్పులేశారు. వీళ్లిద్దరి హుషారుకు అందాల భామ పూజా హెగ్డే తోడయింది. ఈ ముగ్గురూ కలిసి బిల్లి బిల్లి అనే పాటకు డాన్స్ చేసి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచారు. విడుదల చేసిన కాసేపట్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్.. అన్ని వర్గాల ఆడియన్స్ చేత ఈలలు వేయిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) లోనిదే ఈ బిల్లి బిల్లి సాంగ్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించడం విశేషం. జగపతి బాబు, షెహనాజ్ గిల్, విజేందర్ సింగ్ ఇతర పాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఫర్హద్ సామ్జీ (Farhad Samji) తెరకెక్కించిన ఈ భారీ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు.
తమిళ నటుడు అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘వీరమ్’ కు రిమేక్ గా రూపొందుతున్న ఈ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాను ఈద్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి పార్టీ సాంగ్ విడుదల చేయడంతో హుషారెత్తిపోతున్నారు ఆడియన్స్. ఈ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Daggubati venkatesh, Pooja Hegde, Salman khan, Tollywood actor