Home /News /movies /

SALMAN KHAN DABANGG 3 TALK TWITTER REVIEW SR

సల్మాన్ ఖాన్ దబంగ్ 3 ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ..

Twitter

Twitter

హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'దబంగ్ 3'. సల్మాన్‌కు జోడిగా సోనాక్షిసిన్హా నటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైన ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే..

    హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'దబంగ్ 3'. సల్మాన్‌కు జోడిగా సోనాక్షిసిన్హా నటించింది. ‘దబంగ్ సిరీస్’‌లో వస్తోన్న మూడవ సినిమా ఇది. దబంగ్ సిరీస్‌లో వచ్చిన గత రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. మొదటి సినిమా 2010లో వచ్చింది. అభినవ్ కశ్యప్ దర్శకుడు. రెండవ సినిమా 2012లో అర్బాజ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చింది. తాజా సినిమాగా దబంగ్ 3ను ప్రభుదేవా దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో వస్తోన్న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషాల్లో విడుదల చేస్తున్నారు. ఈ తాజా సినిమాలో సల్మాన్‌తో పాటు కన్నడ నటుడు కిచ్చాసుదీప్, డింపుల్ కాపాడియా, ప్రమోద్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై మూవీ అనలిస్ట్ అండ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన అభిప్రాయంను వన్ వర్డ్ రివ్యూ రూపంలో తెలిపారు. ఆయన ‘దబంగ్ 3’ చిత్రాన్ని ఎంటర్ టైనర్‌గా పేర్కోన్నాడు. అంతేకాదు ఈ చిత్రానికి 3.5 రేటింగ్ ఇస్తూ చుల్‌బుల్‌ పాండే ఈజ్ బ్యాక్ అంటూ ట్వీటాడు.

    ఇక సినిమాలో ఆకర్షించే విషయాలను చూస్తే.. దర్శకుడు ప్రభుదేవా.. మాస్ మసాలా పై ఎక్కువ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. దీనికితోడు అదిరిపోయే రేంజ్‌లో ఉన్న ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ ప్రేక్షకుల్నీ ఆకర్షిస్తోంది. ఇక విలన్‌గా నటించిన కిచ్చా సుదీప్ తన నటనతో మైమరిపించాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.









    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Salman khan, Telugu Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు