ప్రభాస్‌ ముందు సల్మాన్ ఔట్.. సాహోని బీట్ చేయలేకపోయిన దబంగ్ 3..

సల్మాన్ ఖాన్ సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. పాత రికార్డులన్నీ బద్ధలైపోతుంటాయి. కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ చేస్తున్నది అదే. అలాంటిప్పుడు ఏకంగా దబంగ్ 3 సినిమాతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 21, 2019, 3:54 PM IST
ప్రభాస్‌ ముందు సల్మాన్ ఔట్.. సాహోని బీట్ చేయలేకపోయిన దబంగ్ 3..
దబంగ్ 3 సాహో సినిమాలు
  • Share this:
సల్మాన్ ఖాన్ సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. పాత రికార్డులన్నీ బద్ధలైపోతుంటాయి. కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ చేస్తున్నది అదే. అలాంటిప్పుడు ఏకంగా దబంగ్ 3 సినిమాతో వచ్చాడు కండల వీరుడు. దాంతో కచ్చితంగా చుల్ బుల్ పాండే దెబ్బకు రికార్డులు కదిలిపోతాయనుకున్నారంతా. కానీ ఇప్పుడు మాత్రం అలాంటిదేం జరగలేదు. దబంగ్ 3కి దారుణమైన టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. ఎందుకో తెలియదు కానీ సల్మాన్ గత రికార్డులను ఒక్కటి కూడా క్రాస్ చేయలేకపోయింది సల్మాన్.

Salman Khan Dabangg 3 movie opening day collections fails to beat Prabhas Saaho movie 1st day pk సల్మాన్ ఖాన్ సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. పాత రికార్డులన్నీ బద్ధలైపోతుంటాయి. కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ చేస్తున్నది అదే. అలాంటిప్పుడు ఏకంగా దబంగ్ 3 సినిమాతో.. salman Khan prabhas,prabhas saaho collections,dabangg 3 1st day collection,dabangg 3 box office collection,dabangg 3 first day collection,dabangg 3 collection,dabangg 3 box office collection day 1,dabangg 3 1st day box office collection,dabangg 3 movie box office collection,box office collection of dabangg 3,dabangg 3,dabangg 3 movie 1st day collection,dabangg 3 full movie,dabangg 3 movie review,dabangg 3 public review,దబంగ్ 3,దబంగ్ 3 కలెక్షన్స్,సల్మాన్ ఖాన్ దబంగ్ 3 కలెక్షన్స్,సాహో దబంగ్ 3 కలెక్షన్స్,తెలుగు సినిమా
ప్రభుదేవాతో మూడోసారి పనిచేసిన సల్మాన్

ముఖ్యంగా సీక్వెల్‌గా వచ్చినా కూడా ఆడియన్స్ ఎందుకో దీనిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన దబంగ్ 3కి పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకు ఉత్తరాదిన కేవలం 20 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అసలు సల్మాన్ సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడం అందరికీ ఆశ్చర్యమే. ప్రభాస్ నటించిన సాహో హిందీ వర్షన్ కంటే ఇది తక్కువ. ఈ సినిమా హిందీలో తొలిరోజే 24 కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ ఇప్పుడు ప్రభాస్ కంటే సల్మాన్ తక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చాడు. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ విడుదలైంది దబంగ్ 3.

Salman Khan Dabangg 3 movie opening day collections fails to beat Prabhas Saaho movie 1st day pk సల్మాన్ ఖాన్ సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. పాత రికార్డులన్నీ బద్ధలైపోతుంటాయి. కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ చేస్తున్నది అదే. అలాంటిప్పుడు ఏకంగా దబంగ్ 3 సినిమాతో.. salman Khan prabhas,prabhas saaho collections,dabangg 3 1st day collection,dabangg 3 box office collection,dabangg 3 first day collection,dabangg 3 collection,dabangg 3 box office collection day 1,dabangg 3 1st day box office collection,dabangg 3 movie box office collection,box office collection of dabangg 3,dabangg 3,dabangg 3 movie 1st day collection,dabangg 3 full movie,dabangg 3 movie review,dabangg 3 public review,దబంగ్ 3,దబంగ్ 3 కలెక్షన్స్,సల్మాన్ ఖాన్ దబంగ్ 3 కలెక్షన్స్,సాహో దబంగ్ 3 కలెక్షన్స్,తెలుగు సినిమా
దబంగ్ 3 సాహో సినిమాలు
ఇక్కడ కూడా ఈ చిత్రానికి పెద్దగా కలెక్షన్స్ రాలేదు. అన్ని వర్షన్స్ కలుపుకుని 2 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చాడు సల్మాన్ ఖాన్. గతంలో వాంటెడ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కించిన ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకుడు. సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ముందు వచ్చిన భారత్ కూడా సల్మాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు దబంగ్ 3 కూడా పెద్దగా రుచించడం లేదు. మొత్తానికి బాలీవుడ్ సూపర్ స్టార్స్‌కు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుంది.
First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు