మూడ్ లేదని.. ఐదు రోజుల ముందు పెళ్లి క్యాన్సిల్ చేసిన బాలీవుడ్ హారో...

సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్‌లో చాలా కథలు వినిపిస్తాయి. చాలా కాలం కత్రినా కైఫ్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నాడంటారు. తాజాగా సింగర్ లూలియా వంతుర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం ఉంది.

news18-telugu
Updated: October 23, 2019, 10:46 PM IST
మూడ్ లేదని.. ఐదు రోజుల ముందు పెళ్లి క్యాన్సిల్ చేసిన బాలీవుడ్ హారో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తనకు పెళ్లిచేసుకునే మూడ్ లేదని... ఏకంగా ఐదారు రోజుల ముందు వివాహాన్ని రద్దు చేసుకున్నాడో బాలీవుడ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. 53 ఏళ్ల వయసొచ్చినా.. ఇంకా బ్యాచిలర్ గానే బండి నడిపిస్తున్న సల్మాన్ ఖాన్ పెళ్లికి ముందు రద్దు చేసుకున్న విషయాన్ని బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలా బయటపెట్టారు. ప్రఖ్యాత టీవీ కార్యక్రమం కపిల్ శర్మ షోలో పాల్గొన్న సాజిద్.. సల్మాన్ పెళ్లి గురించిన విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్‌లో సీనియర్ నిర్మాతగా పేరుపొందిన సాజిద్ నదియాడ్ వాలాకు సల్మాన్ ఖాన్‌తో మంచి అనుబంధం ఉంది. ‘1999లో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాల్సిన టైమ్ వచ్చింది. పెళ్లికూతురు కూడా సిద్ధంగా ఉంది. నా కోసం ఓ అమ్మాయిని వెతుక్కోవాలి. సల్మాన్ తండ్రి పుట్టిన రోజు నవంబర్ 18. ఆ రోజే పెళ్లిచేసుకోవాలని మేం అనుకున్నాం.’ అని సాజిద్ తెలిపారు.

పెళ్లికి అంతా సిద్ధం అయింది. శుభలేఖలు కూడా రెడీ అయ్యాయి. కరెక్టుగా ఐదారు రోజుల ముందు నాకు పెళ్లి వద్దని సల్మాన్ ఖాన్ చెప్పాడు. ఇప్పుడు పెళ్లి చేసుకునే మూడ్ లేదని అన్నాడు. ఆ తర్వాత నా పెళ్లి జరుగుతున్న సమయంలో స్టేజ్ మీదకు వచ్చాడు. నా కళ్లలోకి చూశాడు. బయట కారు ఉంది. పారిపో అని నాకు సలహా ఇచ్చాడు.

సాజిద్ నదియాడ్‌వాలా, బాలీవుడ్ నిర్మాత


అయితే, సల్మాన్‌తో పెళ్లి మిస్ అయిన ఆ యువతి ఎవరనే విషయాన్ని మాత్రం సాజిద్ వెల్లడించలేదు. కానీ, గతంలో సల్మాన్ ఖాన్ చెప్పిన ప్రకారం.. నటి సంగీత బిజిలానీతో తన పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిందని చెప్పాడు.

Salman Khan Sonakshi Sinha Dabangg 3 Official Trailer released directed by Prabhu Deva pk కొన్ని సినిమాలు ఎలా ఉన్నా కూడా కేవలం బ్రాండ్‌తోనే ఆడేస్తుంటాయి. అలాంటి ఓ సినిమా దబంగ్. సల్మాన్ ఖాన్ హీరోగా అభినవ్ సిన్హా తెరకెక్కించిన ఈ చిత్రం పదేళ్ల కింద విడుదలై సంచలన విజయం సాధించింది. Dabangg 3 Official Trailer,Dabangg 3 Official Trailer released,Dabangg 3 Trailer released,salman khan,prabhu deva,salman khan dabangg 3,radhe salman khan,salman khan prabhu deva dance,salman khan dance with prabhu deva,salman khan new movie,salman khan eid 2020,salman khan films,prabhu deva dance,salman khan radhe,salman and prabhu deva comedy,salman khan dance,salman khan wanted 2,salman khan movie,salman khan prabhu deva,salman khan movies,salman khan latest news,salman khan prabhu deva radhe,radhe,salman khan twitter,salman khan instagram,salman khan facebook,prabhu deva facebook,prabhu deva instagram,,ప్రభుదేవా,సల్మాన్ ఖాన్,ప్రభుదేవా సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ రాధే,సల్మాన్ ఖాన్ ప్రభుదేవా రాధే,రాధే మూవీ,రాధే మూవీ,
దబంగ్ 3 అఫీషియల్ పోస్టర్


సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్‌లో చాలా కథలు వినిపిస్తాయి. చాలా కాలం కత్రినా కైఫ్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నాడంటారు. తాజాగా సింగర్ లూలియా వంతుర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 23, 2019, 10:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading