సల్మాన్ ఖాన్ అటు సినిమాలతోనే కాకుండా ఎప్పుడూ వివాదాలతో కూడా దోస్తీ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయన ఇదే చేసాడు. ఎప్పుడో 20 ఏళ్ల కింద చేసిన ఓ తప్పు ఇప్పటికీ సల్మాన్ ఖాన్‌ను వెంబడిస్తూనే ఉంది. అప్పట్లో కృష్ణజింకలను వేటాడిన కేసు ఇప్పటికీ కండల వీరుడి మెడకు చుట్టుకునే ఉంది. హిట్ అండ్ రన్ కేసులో అయినా నిర్ధోషిగా బయటపడ్డాడు కానీ కృష్ణజింకల కేసులో మాత్రం సల్మాన్ ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పటికీ ఆ కేస్ విషయంలో కోర్ట్ మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు కండలవీరుడు. ఇక ఇప్పుడు మరోసారి కోర్ట్ నుంచి ఈ హీరోకు వార్నింగ్ వచ్చింది. జనవరి 17న ఈ కేసు మళ్లీ హియరింగ్‌కు వచ్చింది. అయితే కోర్టుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా నేపథ్యంలో హాజరు కాలేనంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు సల్మాన్ ఖాన్. దాంతో అతడి విన్నపాన్ని మన్నించిన కోర్టు.. ఫిబ్రవరి 6న జరగబోయే తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ సారి కానీ కోర్టుకు హాజరు కాకపోతే బెయిల్ క్యాన్సిల్ చేస్తామని జోధ్ పూర్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అప్పుడు దోషిగా తేలిన సల్మాన్ ఖాన్ రెండ్రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన కరోనాకు ముందు కూడా కోర్టుకు రాకుండా న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తదుపరి విచారణకు ఒకవేళ సల్మాన్ కానీ రాకపోతే ఆయన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయితే కరోనా రావడంతో అంతా సద్దు మనిగింది.

సల్మాన్ ఖాన్
మళ్లీ ఇన్నాళ్లకు కేసు హయరింగ్కు వచ్చింది. దాంతో ఫిబ్రవరి 6న కోర్టుకు రావాలని ఆదేశించింది. 1998 హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్లో భాగంగా అక్టోబర్‌లో జోధ్‌పూర్‌లో జింకలను వేటాడినందుకు ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్‌కు 2018 మార్చిలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మిగిలిన నిందితులుగా ఉన్న సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలం, టబు, దుష్యంత్ సింగ్‌లను నిర్దోషులుగా ప్రకటించింది న్యాయస్థానం. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇరుక్కుపోయాడు.

సల్మాన్ ఖాన్ (ఫైల్ ఫొటో)
వన్యప్రాణుల రక్షణ చట్టం కింద దోషిగా తేలినప్పుడు సీజేఎం కోర్టు సల్మాన్‌కు 10000 జరిమానా విధించింది. ఆ తర్వాత జోధ్‌పూర్‌లోని జిల్లా సెషన్స్ కోర్టుకు కేసు వెళ్లగా..స్టే విధించిన కోర్టు 2018లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పట్నుంచి బయటికి వచ్చాడు సల్మాన్ ఖాన్. మళ్లీ ఇప్పుడు కేసు హియరింగ్‌కు వచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:January 17, 2021, 20:33 IST