Salman Khan - Bigg Boss 15: బిగ్‌బాస్ సీజన్ 15 కోసం సల్మాన్ ఖాన్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్..

సల్మాన్ ఖాన్ (Salman khan photo : Twitter)

Salman Khan - Bigg Boss 15: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్.. గత కొన్నేళ్లుగా హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ప్రసారం కానున్న

 • Share this:
  Salman Khan - Bigg Boss 15: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్.. గత కొన్నేళ్లుగా హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ సీజన్ 15కు ఈయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షో కోసం ఈయన భారీగా పారితోషకం అందుకోబోతున్నట్టు సమాచారం. ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా మంచి సక్సెస్ సాధించింది. అదే ఊపుతో తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో నాగార్జున ఐదో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఈయన మూడోసారి బిగ్‌బాస్ తెలుగు సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ హిందీలో మాత్రం ఇప్పటి వరకు బిగ్‌బాస్ రియాలిటీ షో 14 సీజన్లు పూర్తి చేసుకుంది. 15 వ సీజన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేరేషన్స్ మొదలైయ్యాయి. ప్రతి సీజన్‌లో సల్మాన్ ఖాన్ తన రెమ్యుననరేషన్ పెంచుకుంటూ పోతున్నారు.

  తాజాగా 15వ సీజన్‌కు సల్మాన్ ఖాన్ మరోసారి హోస్ట్ చేయబోతున్నారు.తాజాగా బిగ్‌బాస్ షో సీజన్ 15లో ఒక్కో ఎసిపోడ్‌కు సల్మాన్ ఖాన్.. రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ 14 సీజన్స్‌లలో 11 సీజన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా.

  Bollywood star hero salman khan to charge rupees 16 crore per episode for bigg boss 14 season,salman khan,salman khan bigg boss 14,salman khan remunaration for bigg boss 14,16 crore remunaration fro bigg boss 14,salman khan twitter,salman khan instagram,bigg boss, hindi bigg boss, bigg boss season 12, salman khan, salman khan bigg boss, బిగ్‌బాస్, సల్మాన్ ఖాన్ బిగ్ బాస్,సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్,సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ 14,సల్మాన్ ఖాన్ 16 కోట్ల పారితోషకం,సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ సీజన్ 14కు అత్యధిక పారితోషకం
  సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో


  అంటే సల్మాన్ ఖాన్.. ప్రతి వారం వీకెండ్ శని, ఆదివారాలు ఎపిసోడ్‌లో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.  ఈ లెక్కన 100 రోజల్లో 14 వారాలు అంటే 28 నుంచి 30 రోజలు సల్మాన్ ఖాన్.. బిగ్‌బాస్ ఎసిపోడ్‌లో కనిపిస్తాడు. ఈ లెక్కన మొత్తం బిగ్‌బాస్ 14 సీజన్ కోసం సల్మాన్ ఖాన్.. రూ. 450  కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు  పారితోషకం అందుకునే అవకాశాలున్నాయి.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

  మొత్తంగా ఒక సినిమాలో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తే.. రూ. 50 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నారు.  అదే బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో ద్వారా అంతకు 9 నుంచి 10 రెట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మొత్తంగా సల్మాన్ ఖాన్.. తన క్రేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నాడనే చెప్పాలి.

  బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

  ఈ యేడాది సల్మాన్ ఖాన్.. ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ సినిమాతో పలకరించారు. ఈ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేసారు. ఈ సినిమాకు దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ .. ‘టైగర్ 3’ సినిమా చేస్తున్నారు. మరోవైపు ‘కభీ ఈద్ కభీ దీవాళి’ సినిమాలతో పలకరించనున్నారు.  దాంతో పాటు ఆమీర్ ఖాన్.. ‘లాల్ సింగ్ ఛద్ధా’ తో పాటు షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘పఠాన్’ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అందులో ‘టైగర్’ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: