హోమ్ /వార్తలు /సినిమా /

Salman Khan: అమితాబ్ తర్వాత బాలీవుడ్‌లో ఆ రికార్డు అందుకున్న హీరో సల్మాన్‌ ఖాన్ మాత్రమే..

Salman Khan: అమితాబ్ తర్వాత బాలీవుడ్‌లో ఆ రికార్డు అందుకున్న హీరో సల్మాన్‌ ఖాన్ మాత్రమే..

అమితాబ్, సల్మాన్ ఖాన్ (Twitter/Photo)

అమితాబ్, సల్మాన్ ఖాన్ (Twitter/Photo)

Amitabh Bachchan - Salman Khan : అవును బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ రికార్డు సల్మాన్ ఖాన్‌కు మాత్రమే సాధ్యం అయింది. వివరాల్లోకి వెళితే..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Amitabh - Salman : అవును బాలీవుడ్‌లో  బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ రికార్డు  సల్మాన్ ఖాన్‌కు మాత్రమే సాధ్యం అయింది. వివరాల్లోకి వెళితే.. 1988లో ‘బీవీ హోతో ఐసీ’ సినిమాతో నటుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సల్మాన్ ఖాన్.ఆ తర్వాత సూరజ్ ఆర్. బర్జాత్యా డైరెక్షన్‌లో చేసిన ‘‘మైనే ప్యార్ కియా’’ తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యారు. ఈ సినిమాలో సల్మాన్..ప్రేమ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ఇదే సినిమాను తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా డబ్ చేస్తే ఇక్కడ కూడా ఓ రేంజ్‌లో హిట్టైయింది. ఆ తర్వాత మరోసారి సూరజ్.ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో చేసిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సినిమాలో మరోసారి ప్రేమ్ పాత్రతో అలరించారు. ఈ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే  ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.

ఆ తర్వాత మూడోసారి సూరజ్ బర్జాత్యా డైరెక్షన్‌లొ చేసిన మూడో సిన్మా ‘‘హమ్ సాథ్ సాథ్ హై’’ సినిమాలో మరోసారి ప్రేమ్ క్యారెక్టర్ తో మరో హిట్టును అందుకున్నారు. ఆ తర్వాత నాల్గోసారి సూరజ్.ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో చేసిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాలో ప్రేమ్ పాత్రతో ఆడియన్స్‌కు ప్రేమను పంచారు.

Maine Pyar Kiya star Bhagyashree second innings with shivani debut movie
‘మైనే ప్యార్ కియా’లో తొలిసారి ప్రేమ్ పాత్రలో కనిపించిన సల్మాన్ ఖాన్ (Twitter/Photos)

తాజాగా సల్మాన్ ఖాన్..సూరజ్ ఆర్.బర్జాత్యా దర్శకత్వంలో మరోసారి ప్రేమ్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రేమ్ పాత్ర చేసిన ప్రతిసారి సల్మాన్ ఆడియన్స్ మనుసులు దోచుకున్నారు. ఒక్క సూరజ్ ఆర్. బర్జాత్యా దర్శకత్వంలో చేసిన సినిమాలోనే కాదు..‘అందాజ్ అప్నా అప్నా’, ‘జుడ్వా’, ‘దీవానా మస్తానా’, ‘బీబీ నెంబర్ 1, సిర్ఫ్ తుమ్’, ‘ఛల్ మేరే భాయి’,‘కహా ప్యార్ నా హో జాయే’’, నో ఎంట్రీ, పార్ట్ నర్, మేరీ గోల్డ్, ‘రెడీ’ వంటి సినిమాల్లో 15 సార్లుకు పైగా ప్రేమ్ క్యారెక్టర్‌లో మెప్పించారు.

బాలీవుడ్‌లో అమితాబ్ తర్వాతి తరంలో ఒక కథానాయకుడు ఇన్ని సినిమాల్లో ఒకే పేరుతో నటించడం ఒక రికార్డు అనే చెప్పాలి. అమితాబ్ బచ్చన్ ఆయన కెరీర్‌లో ఎక్కువగా విజయ్ పాత్రలో నటించారు. ఈయన తర్వాత సల్మాన్ ఖాన్ ఎక్కువగా బాలీవుడ్‌లో ప్రేమ్ పాత్రలో యాక్ట్ చేసారు. అమితాబ్ బచ్చన్,  సల్మాన్ ఖాన్‌తో చేసిన సినిమాల విషయానికొస్తే.. వీళ్లిద్దరు.. ‘బాగ్‌బన్, ’ బాబుల్’, ‘హలో బ్రదర్’, ‘బాబుల్’ చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

మొత్తంగా బాలీవుడ్‌లో అప్పట్లో అమితాబ్ బచ్చన్ తర్వాత సల్మాన్ ఖాన్ ఒకే పేరున్న పాత్రలో ఎక్కువ సినిమాల్లో నటించారు. గతేడాది సల్మాన్ ఖాన్.. ‘రాధే’ సినిమాతో పాటు ఆ తర్వాత ‘అంతిమ్’ సినిమాలతో పలకరించారు. ఈ యేడాది చిరు ‘గాడ్ ఫాదర్’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.  త్వరలో ‘టైగర్ 3’ మూవీతో పకలరించనున్నారు. దాంతో పాటు  షారుఖ్ ఖాన్.. ‘పఠాన్’ మూవీలతో పలకరించనున్నారు.

First published:

Tags: Amitabh bachchan, Bollywood news, Salman khan

ఉత్తమ కథలు