ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... హఠాత్తుగా తనువు చాలించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన మరణానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలే కారణం అని ప్రముఖ నటులతో పాటు ఆయన అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారసత్వం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా కరణ్ జోహార్, ఆలియా భట్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖుల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సల్మాన్, ఆలియా, కరణ్ జోహార్లను ఏకి పారేస్తున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో ఆయా సెలబ్రిటీలను లక్షల మంది అన్ ఫాలో చేసారు. అంతేకాదు బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్‌ను సెట్ చేసారు.

సుశాంత్ సింగ్ అలియా భట్ (sushant singh rajput alia bhatt)
ఇక ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన నేటివ్ రాష్ట్రం బిహార్‌లోని ఆయన అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు. ఈ సందర్భంగా వాళ్లు అక్కడ సల్మాన్, కరణ్ జోహార్, ఆలియా భట్ల చిత్రాలను విడుదల కానీయ్యబోమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెట్టారు. మొత్తంగా ఈ కోపతాపాలు ఎన్నాళ్లు ఉంటాయనేది చూడాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలోని రాజకీయాలు భరించలేకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.