• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SALMAN AND JACQUELINE FERNANDEZ NEW SONG TERE BINA ROMANTIC TRACK RELEASED TA

ఫామ్‌హౌస్‌లో జాక్వెలిన్‌తో సల్మాన్ ప్రేమాయణం.. వైరల్ అవుతున్న వీడియో..

ఫామ్‌హౌస్‌లో జాక్వెలిన్‌తో సల్మాన్ ప్రేమాయణం.. వైరల్ అవుతున్న వీడియో..

జాక్వెలిన్‌తో సల్మాన్ ఫ్రేమాయణం (Twitter/Photo)

లాక్‌డౌన్ సమయంలో సల్మాన్ ఖాన్ తన ఫామ్‌హౌస్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొత్త పాటలను తెరకెక్కిస్తూ.. వాటిని తన ఫామ్‌హౌస్‌లో షూట్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో కలిసి చేసిన ప్యార్ కరోనా అనే పాటను రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్.. తాజాగా తేరా మినా అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసాడు.

  • Share this:
    లాక్‌డౌన్ సమయంలో సల్మాన్ ఖాన్ తన ఫామ్‌హౌస్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొత్త పాటలను తెరకెక్కిస్తూ.. వాటిని తన ఫామ్‌హౌస్‌లో షూట్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో కలిసి చేసిన ప్యార్ కరోనా అనే పాటను రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్.. తాజాగా తేరా మినా అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసాడు. ఈ పాటను పాడడంతో పాటు దీన్ని షూట్ చేసింది నేను అంటూ సల్మాన్ చెప్పుకొచ్చాడు. మీరూ చూడండి.. మీ వెర్షన్‌లో షూట్ చేసి నాకు ట్యాగ్ చేయండి అంటూ ట్వీట్ చేసాడు. ఇందులో సల్మాన్, జాక్వెలిన్ ప్రేమ ప్రయాణాన్ని చూపించారు. ఇద్దరు బైక్‌పై జీపులో షికారు చేయడంతో పాటు కలిసి ఈత కొట్టడం ఈ పాటలో ఉంది. అయితే అదంతా సల్మాన్ కల కన్నట్టు తెరకెక్కించారు. షబ్బరీ అహ్మద్ రాసిన ఈ పాటకు అజయ్ భాటియా సంగీతం అందించారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడతూ.. మేం ఫామ్‌హౌస్‌కు వచ్చిన ఏడు వారాలవుతోంది. లాక్‌డౌన్ వల్ల ఇన్ని రోజులు ఒక్కచోటే ఉండిపోతామని అనుకోలేదు. అందుకే మమ్మల్ని మేము బిజీ చేసుకోవడానికి ఈ పాటను డిజైన్ చేసినట్టు సల్మాన్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి లాక్‌డౌన్ వల్ల సల్మాన్‌, జాక్వెలిన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ఇది ఓ అవకాశంగా దొరికిందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: