ప్రస్తుతం ఎక్కడ చూసినా కేజీఎఫ్ చాప్టర్-2 (KGF Chapter-2) గురించే చర్చ జరుగుతోంది. దేశమంతటా ఈ మూవీనే హాట్ టాపిక్. ఎన్నో అంచనాల మధ్య నేడు కేజీఎఫ్ చాప్టర్-2 విడుదలయింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులో కిక్కిరిసిపోయాయి. ఐతే కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల వేళ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌కి దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మూవీ బ్రేక్ సమయంలో సలార్ టీజర్ (Salaar Teaser)ను థియేటర్లలో ప్రదర్శించారు. 'మోస్ట్ వయెలెంట్ మ్యాన్' అని స్క్రీన్‌పై బొమ్మ పడగానే.. థియేటర్ లోపల రీసౌండ్ వస్తోంది. సలార్‌లో ప్రభాస్ కటౌట్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు శృతి హాసన్ లుక్‌ని కూడా ఇందులో రివీల్ చేశారు. కరాటే చేస్తూ.. ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది.వెండితెరపై సలార్ టీజర్‌ని చూసి.. ఈలలు వేస్తూ..గోల చేశారు ఫ్యాన్స్. అరుపు కేకలతో అన్ని థియేటర్లలోనూ ఇదే సందడి నెలకొంది.
KGF Chapter 2 Twitter Review : కేజీఎఫ్ ఛాప్టర్ 2 ట్విట్టర్ రివ్యూ..
The most Violent👊😡👊 Man #Prabhas Anna in #Salaar 🔥 #KGF2InCinemas pic.twitter.com/kdOchppaXW
— #Subbu Gadu Romeo 😎👈 (@all_prabhas) April 13, 2022
ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్లలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. చాలా రఫ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడు టీజర్‌లో మోస్ట్ వయెలెంట్ మ్యాన్ అని చూపించడంతో.. ప్రభాష్‌ను ఇందులో వయెలెంట్‌గా చూపించబోతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ టీజర్ అదిరిపోయిందని సంబరపడుతున్నారు. కేజీఎఫ్ సాధించినట్లుగానే.. సలార్ కూడా అన్ని రికార్డులను తిరగరాస్తుందని ఇప్పటి నుంచే ధీమాగా ఉన్నారు.
Vijay - Beast : విజయ్ అభిమానుల అతి.. టాక్ బాగాలేదని ఏకంగా థియేటర్‌కు నిప్పు పెట్టారు..
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’ మూవీ షూటింగ్ ఇప్పటికే 60శాతం పూర్తయింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శృతిహాసన్, జగపతిబాబు వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ మూవీలో కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారట. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం విపరీతంగా అంచనాలు ఉన్నాయి. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను Hombale Films నిర్మిస్తోంది. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2023లో సలార్ మూవీని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాష్ పాన్ ఇండియా స్టార్, కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ అందించిన ప్రశాంత్ నీల్ కాంబినేషనల్లో ఈ సినిమా వస్తుండంతో.. సలార్‌పై అభిమానుల్లో ఎన్నో అంచనాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Prashanth Neel, Salaar, Salaar movie, Tollywood