హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: ప్రభాస్ వెండితెరపైనే కాదు.. ఆస్తుల్లో కూడా నిజంగానే బాహుబలి.. సాక్ష్యం ఇదిగో..

Prabhas: ప్రభాస్ వెండితెరపైనే కాదు.. ఆస్తుల్లో కూడా నిజంగానే బాహుబలి.. సాక్ష్యం ఇదిగో..

Prabhas | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్  ఇండియా స్టార్ అయిపోయాడు.

Prabhas | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్  ఇండియా స్టార్ అయిపోయాడు.

Prabhas | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్  ఇండియా స్టార్ అయిపోయాడు.

  Prabhas | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్  ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసినా.. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో హోల్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  బాహుబలి సిరీస్‌తో  ప్రభాస్ క్రేజ్.. లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది.  బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నఈ సినిమా నార్త్‌లో మాత్రం ఇరగదీసింది. మొత్తంగా బాహుబలి సినిమాతో ప్రభాస్.. ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత సాహో సినిమాకు దాదాపు నిర్మాణంలో వాటి పాటు రెమ్యూనరేషన్ కలిపి దాదాపు రూ.75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొని అందరినీ ఆశ్యర్యపరిచాడు

  ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న ‘రాధే శ్యామ్’ మూవీ  కోసం కూడా దాదాపు అంతే లెవల్‌లో పుచ్చుకుంటున్నాడు. ఇక అశ్వినీదత్ వైజయంతి మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న సినీ వర్గాలు చెబుతున్నాయి.

  Young rebel star prabhas shock to his fans here are the details,prabhas,prabhas twitter,Prabhas no updates after corona,prabhas covid 19,prabhas fans,prabhas fans request,prabhas fans twitter open request,prabhas in social media,prabhas 4 crore donation,prabhas 3 crore PM relief fund,prabhas 1 crore to AP Telangana cm relief fund,prabhas movies,prabhas radha krishna movie,prabhas self quarantine 14 days,prabhas sister,telugu cinema,prabhas krishnam raju,prabhas coronavirus,ప్రభాస్,ప్రభాస్ 4 కోట్ల విరాళం,ప్రభాస్ కరోనా వైరస్,ప్రభాస్ సెల్ఫ్ క్వారెంటైన్
  ప్రభాస్ (Prabhas fans request)

  నాగ్ అశ్విన్ సినిమా తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ‘సలార్’ సినిమా ఒక్కో దానికి రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ఒక్కో సినిమా కోసం ఇంత పారితోషకం తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్.. సల్మాన్ ఖాన్ తర్వాతి స్థానంలో ఉన్నారు.

  prabhas, radhe shyam, prabhas radhe shyam, song shoot for radhe shyam, radhe shyam in hyderabad, huge set for radhe shyam, director radha krishna kumar, jil director, pooja hegde, uv creations, ప్రభాస్, యూవీ క్రియేషన్స్, రాధేశ్యామ్
  ప్రభాస్ (File/Photo)

  సినిమాల్లో ప్రభాస్ తీసుకునే ఈ రెమ్యునరేషన్ పక్కనపెడితే.. ప్రభాస్‌కు పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు నిర్మాతగా పెద్ద నాన్న కృష్ణంరాజుతో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై  పలు హిట్ చిత్రాలను నిర్మించారు. అంతేకాదు కృష్ణంరాజుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆయనే దగ్గరుండి చేసుకునేవారు. ప్రభాస్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో పాటు చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో స్థలాలను కొన్నారు. అంతేకాదు వాళ్లకు ఒక గ్రానైటు ఫ్యాక్టరీ ఉంది. వీటితో పాటు వ్యవసాయ ఆధారిత పొలాలు, కొబ్బరి తోటలు, వివిధ నగరాల్లో ఫామ్‌హౌస్‌లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నట్టు ప్రభాస్ సమాచారం. ఎంత లేదన్న ప్రభాస్‌ స్థిర, చర ఆస్తులు కలపి దాదాపు రూ. 7 వేల కోట్లకు పైగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే తెలుగుల ఇండస్ట్రీలో ఇంత ఆస్తులున్న హీరో మరెవరు లేకపోవచ్చు. సో.. ప్రభాస్.. వెండితెరపై కాదు.. ఆస్తుల్లో కూడా నిజంగానే బాహుబలి అనే చెప్పొచ్చు.

  First published:

  Tags: Adipurush movie, Nag Ashwin, Om Raut, Prabhas, Prashanth Neel, Radhe Shyam, Salaar

  ఉత్తమ కథలు