Home /News /movies /

SALAAR BUDGET DOUBLED FOR SALAAR PRE CLIMAX SCENE SB

Salaar: రెండు పార్టులుగా సలార్.. క్లైమాక్స్‌ సీన్ కోసం అన్ని కోట్లా..! ప్రభాస్ తగ్గేదేలే

‘సలార్’లో ప్రభాస్ (Twitter/Photo)

‘సలార్’లో ప్రభాస్ (Twitter/Photo)

సలార్‌ను కూడా కేజీఎఫ్ తరహాలో రెండు పార్టులుగా తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమా క్లైమాక్స్ సీన్లను ఎవరూ ఊహించని విధంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్.

    రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తన్న కొత్త సినిమా సలార్(Salaar). కేజీఎఫ్(KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజగా కేజీఎఫ్ విడుదల పూర్తవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ సలార్ పై దృష్టి పెట్టాడు. సలార్ షూటింగ్ ఫుల్ స్వింగులో ఉంది. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతోన్న సలార్(Salaar) సినిమా ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే టాక్ ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ వార్త ట్విట్టర్‌‌ను షేక్ చేస్తోంది. సలార్ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా రాబోతోందనే టాక్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సలార్‌ను కూడా కేజీఎఫ్ తరహాలో రెండు పార్టులుగా తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్(Prashnth Neel) ఫిక్స్ అయ్యాడట. ఈ మేరకు హోంబళే నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని టాక్.

    ఇక సలార్ లోని ప్రీ క్లైమాక్స్ సన్నివేశాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఓ సీన్ కోసం ఏకంగా కోట్లలో ఖర్చు పెట్టబోతోన్నాడట ప్రశాంత్ నీల్. మొదట్లో ఆ సన్నివేశంకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో పది కోట్లు ఖర్చు చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు. అయితే ఇప్పుడు కేజీఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో ఏమాత్రం ఏకంగా 20 కోట్ల రూపాయలను ఆ ఒక్క ప్రీ క్లైమాక్స్ సన్నివేశానికి ఖర్చు చేయబోతున్నారని సమాచారం. మరోవైపు సలార్ మూవీలో ప్రభాస్(Prabhas) అత్యంత క్రూరంగా కనిపించబోతోన్నాడట. భారీ ఎత్తున నిర్మించే యాక్షన్ సీన్ల కోసం మిలటరీ వాన్‌లు, గన్స్ వంటివాటిని వాడుతున్నారట. సలార్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని సమాచారం అందుతోంది.

    సలార్ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ఈ యాక్షన్ సీన్ కు సంబంధించిన షూట్ పూర్తైందని సమాచారం . భయంకరమైన లోయలో ఛేజింగ్ సన్నివేశాలతో ఈ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించారని తెలుస్తోంది. సలార్ మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందట. సలార్(Salaar Movie) మే 1తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలువ్వబోతోంది. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ గురించిన క్రేజీ అప్ డేట్ ఇపుడు అభిమానులను ఊరిస్తోంది. సలార్ సినిమా పై మరింత అంచనాలను పెంచుతోంది. మొత్తానికి సలార్‌ను మాత్రం ప్రశాంత్ నీల్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేశాడని అర్థమవుతోంది. ఈ చిత్రం నుంచి శ్రుతీ హాసన్ (Shruthi Hasan) పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆద్య పాత్రలో శ్రుతీ హాసన్ కనిపించబోతోంది.

    కేజీఎఫ్ 2’ను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ ప్రస్తుతం ‘సలార్’ను నిర్మిస్తోంది. కనుక బడ్జెట్ విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఇక ప్రభాస్, శృతి హాసన్‌ల మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ సలార్‌తో పాటు ఆదిపురుష్(Aadipurush), ప్రాజెక్ట్ కే(Project K) సినిమాలు కూడా చేస్తున్నారు . ఆది పురుష్ షూటింగ్ కూడా కంప్లిట్ అయింది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులు నడుస్తున్నాయి. వైజయంతి మూవీస్ ప్రాజెక్ట్ కే, మరో చిత్రం 'స్పిరిట్' సినిమా ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అయితే ప్రాజెక్ట్ కే కూడా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Prabhas, Prashanth Neel, Salaar, Salaar movie, Shruthi haasan

    తదుపరి వార్తలు