"శైల‌జారెడ్డి అల్లుడు" ప్రివ్యూ.. చైతూ భుజాల‌పై చెప్ప‌లేని భారం..

ర‌మ్య‌కృష్ణ అత్త‌గా న‌టించ‌డం.. "అల్ల‌రి అల్లుడు"కు రీమేక్ అని వార్త‌లు వినిపిస్తుండ‌టంతో ఆస‌క్తి అంత‌కంత‌కూ పెరిగిపోతుంది. పైగా బిజినెస్ కూడా చైతూ మార్కెట్‌తో సంబంధం లేకుండా 28 కోట్ల‌కు చేసారు. దాంతో ఇప్పుడు త‌న‌ను తాను నిరూపించుకోడానికి "శైల‌జారెడ్డి అల్లుడు" కీల‌కంగా మారింది.

news18-telugu
Updated: September 12, 2018, 7:54 PM IST
శైలజారెడ్డి అల్లుడు (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: September 12, 2018, 7:54 PM IST
నాగ‌చైత‌న్య సినిమాల్లోనే హైయ్య‌స్ట్ థియేట‌ర్స్‌లో.. భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది "శైల‌జారెడ్డి అల్లుడు". మారుతి తెర‌కెక్కించిన ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా ఆస‌క్తిగా వేచి చూస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా చూడ‌ని మారుతి ద‌ర్శ‌కుడు కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు ఇంకా భారీగా పెరిగిపోయాయి. సెప్టెంబ‌ర్ 13న ఈ చిత్రం విడుద‌ల అవుతుంది. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా 800 స్క్రీన్స్‌లో వ‌స్తున్నాడు అల్లుడు. ఓవర్సీస్‌లోనే 173 లొకేషన్స్‌లో విడుదలవుతుంది ఈ చిత్రం.

"శైల‌జారెడ్డి అల్లుడు" ప్రివ్యూ.. చైతూ భుజాల‌పై చెప్ప‌లేని భారం.. sailaja reddy alludu preview.. naga chaitanya bets high..
శైలజారెడ్డి అల్లుడు


ర‌మ్య‌కృష్ణ అత్త‌గా న‌టించ‌డం.. "అల్ల‌రి అల్లుడు"కు రీమేక్ అని వార్త‌లు వినిపిస్తుండ‌టంతో ఆస‌క్తి అంత‌కంత‌కూ పెరిగిపోతుంది. పైగా బిజినెస్ కూడా చైతూ మార్కెట్‌తో సంబంధం లేకుండా 28 కోట్ల‌కు చేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు చైతూ కెరీర్‌లో హైయ్య‌స్ట్ వ‌సూళ్లు తీసుకొచ్చిన సినిమా "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం 26 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. "మ‌నం" 39 కోట్లు వ‌సూలు చేసినా కూడా అందులో సోలో హీరో కాదు నాగ‌చైత‌న్య‌. దాంతో ఇప్పుడు త‌న‌ను తాను నిరూపించుకోడానికి "శైల‌జారెడ్డి అల్లుడు" కీల‌కంగా మారింది.

"శైల‌జారెడ్డి అల్లుడు" ప్రివ్యూ.. చైతూ భుజాల‌పై చెప్ప‌లేని భారం.. sailaja reddy alludu preview.. naga chaitanya bets high..
శైలజారెడ్డి అల్లుడు ట్విట్టర్ ఫోటో
ఓ ర‌కంగా 28 కోట్లు అంటే చైతూ భుజాల‌పై మోయ‌లేని భారం వేసిన‌ట్లే. అయితే వినాయ‌క‌చవితి వీకెండ్ కావ‌డం.. సినిమాపై పూర్తిగా పాజిటివ్ బ‌జ్ ఉండ‌టంతో "శైల‌జారెడ్డి అల్లుడు" ఏదో మ్యాజిక్ చేస్తాడ‌ని ఊహిస్తున్నారు బ‌య్య‌ర్లు కూడా. క‌చ్చితంగా ఈ చిత్రంతో 35 కోట్ల మార్క్ అందుకోవాల‌ని చూస్తున్నాడు చైతన్య‌. మ‌రోవైపు ఈ చిత్రం అను ఎమ్మాన్యువ‌ల్ కెరీర్‌కు కీల‌కంగా మారింది. చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి చూడాలిక‌.. అల్లుడు ఎంత‌వ‌ర‌కు వ‌సూలు చేస్తాడో..?
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...