హోమ్ /వార్తలు /సినిమా /

నేను నెపొటిజం బాధితుడినే.. సైఫ్ అలీ ఖాన్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు..

నేను నెపొటిజం బాధితుడినే.. సైఫ్ అలీ ఖాన్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు..

సైఫ్ అలీ ఖాన్ (Image: Yogen Shah)

సైఫ్ అలీ ఖాన్ (Image: Yogen Shah)

తాజాగా సుశాంత్ ఆత్మహత్యకు నెపోటిజం కారణం అంటూ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్.. చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... హఠాత్తుగా తనువు చాలించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన మరణానికి బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఉన్న వారసత్వ రాజకీయాలే కారణం అని  కంగనా రనౌత్, రవీనా టాండన్ సహా పలువురు ప్రముఖులు స్పందించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సుశాంత్ ఆత్మహత్యకు నెపోటిజం కారణం అంటూ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్.. చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈయన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇక సుశాంత్‌ను తాను ఎంతగానో ప్రోత్సహించినట్టు చెప్పారు. ఆయనతో కలిసి ‘దిల్ బేచారా’ సినిమాలో కలిసి నటించి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తన కూతురు సారా అలీ ఖాన్  మొదటి చిత్రం కూడా సుశాంత్ సింగ్‌తో ‘కేదార్‌నాథ్’ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఆ సంగతి పక్కన పెడితే.. ఐతే.. సైఫ్ అలీ ఖాన్ నెపోటిజం పై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన వ్యాఖ్య దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకప్పటి బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ కొడుకుగా.. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌటీ వంటి బ్యాక్ గ్రౌండ్ ఉంది. మన్సూర్ అలీ ఖాన్ ఒక సంస్థానానికి మహారాజు.

అటువంటి బ్యాక్ గ్రౌండ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్‌ నెపోటిజం గురించి మాట్లాడటం చూస్తుంటే నవ్వుస్తోందంటూ కొంత మంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు అప్పట్లో ఈయనకు ‘హమ్ తుమ్’ సినిమాకు జాతీయ అవార్డు ఎలా వచ్చిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అందులో సైఫ్ యాక్టింగ్ పెద్దగా ఏమి లేదనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. అప్పట్లో వాళ్ల అమ్మగారైన షర్మిలా ఠాగూర్ జాతీయ అవార్డుల జ్యూరీ హెడ్‌గా ఉండబట్టే సైఫ్ అలీ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకోవైపు కృష్ణ జింకల వేట కేసులతో నిందితుడైన ఈయన తనకున్న పాపులారిటీతో పద్మశ్రీ బిరుదును కూడా దక్కించుకున్నాడనే వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లో తోపు లాంటి ఎంతో మంది నటులు ఉండగా ఈయనకు పద్మశ్రీ బిరుదు రావడం వెనక కూడా నెపోటిజం ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సైఫ్ అలీ ఖాన్ మంచి నటుడే అయినా.... ఆయనకున్న టాలెంట్ ఉన్న వాళ్లు బాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. ఈయన ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండటానికి కారణం.. నెపోటిజమే అంటున్నారు మరికొంత మంది.

First published:

Tags: Bollywood, Saif Ali Khan, Sushanth singh Rajputh

ఉత్తమ కథలు