నాగార్జున 'వైల్డ్ డాగ్’లో సాయి తేజ్ హీరోయిన్..

మన్మథుడు 2 లాంటీ డిజాస్టర్ తర్వాత నాగార్జున కొంత గ్యాప్ తీసుకుని  ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాతో వస్తున్నాడు.

news18-telugu
Updated: January 27, 2020, 7:37 AM IST
నాగార్జున 'వైల్డ్ డాగ్’లో సాయి తేజ్ హీరోయిన్..
సయామీ ఖేర్, నాగార్జున Twitter
  • Share this:
మన్మథుడు 2 లాంటీ డిజాస్టర్ తర్వాత నాగార్జున కొంత గ్యాప్ తీసుకుని  ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాతో వస్తున్నాడు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో నాగార్జున ప్రధాన పాత్రలో అలరించనుండగా.. ఓ కీలక పాత్రలో  హిందీ నటీ సయామీ ఖేర్ నటించనుంది. ఈ భామ ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్ సరసన రేయ్ మూవీలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా మరే తెలుగు సినిమాలో నటించలేదు. ఇన్ని రోజుల తర్వాత సయామీ  నాగార్జున చేస్తోన్న ‘వైల్డ్ డాగ్’లో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమెది రెగ్యులర్ క్యారెక్టర్ కాదనీ, పర్ఫార్మెన్సుకు బాగా ప్రాధ్యాన్యం ఉన్న పాత్రనీ, ఆ పాత్రకు ఆమె అయితే న్యాయం చేస్తున్న నమ్మకంతో ఆమెను దర్శక నిర్మాతలు తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబందించి ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో అక్కినేని నాగార్జున అద్భుతంగా నటిస్తున్నారనీ, ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభూతినిస్తుందనీ చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో దియా మీర్జా నటిస్తోంది.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు